38.2 C
Hyderabad
May 2, 2024 21: 13 PM
Slider ముఖ్యంశాలు

కూన శ్రీశైలం గౌడ్ అరెస్ట్

#Koona Srisailam Goud arrested

సీఎం మెదక్ జిల్లాలో పర్యటన కోసం కుత్బుల్లాపూర్ మీదుగా వెళ్లనున్న నేపథ్యంలో ముందస్తు చర్యలుగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు.జీడిమెట్ల పారిశ్రామిక వాడ సూపర్ మాక్స్ కంపెనీ వద్ద కార్మికుల సమస్యలపై మాట్లాడడానికి వచ్చిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.గత కొన్ని నెలలుగా సూపర్ మాక్స్ కంపెనీ కార్మికులు తమ సమస్యలపై పరిశ్రమ ముందు నిరవధిక దీక్ష చేస్తున్నారు.

ఈ క్రమంలో సీఎం కేసీఆర్ జీడిమెట్ల మీదుగా మెదక్ వెళ్తున్నారని తెలుసుకున్న కార్మికులు ఆయనకు మెమోరండం ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుసుకున్న పోలీసులు కార్మికులను కంపెనీ లోపలికి పంపించి బయటకు రాకుండా చేస్తున్నారని తెలుసుకున్న కూన శ్రీశైలం గౌడ్ కార్మికుల తరఫున మాట్లాడటానికి అక్కడికి వెళ్లారు.

దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని బాచుపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రజాకర్ల పాలన కొనసాగుతుందని దుయ్యబట్టారు.

Related posts

విశాఖపట్నం పోర్టు ట్రస్టు ను సందర్శించిన ఆదిత్య మిట్టల్

Satyam NEWS

రాజంపేట ఎమ్మెల్యే మేడా కి వ్యతిరేకంగా పోస్టర్లు

Bhavani

ఆయన లేనిదే అక్కడ ఎవ్వరూ జాతీయ జెండా ఎగురవేయలేరు..!

Satyam NEWS

Leave a Comment