26.7 C
Hyderabad
May 12, 2024 09: 40 AM
Slider హైదరాబాద్

భాగ్య‌న‌గ‌రాన్నిఅన్ని రంగాల్లో ముందుంచాం

ktr press meet

తెలంగాణ ఏర్పడిన కొత్తలో టీఆరెస్ పై అనేక విమర్శలు చేశారని దానికి త‌గ్గ‌ట్టుగానే వారికి చేసి చూపించిన ఘ‌ట‌న సీఎం కేసీఆర్‌కు ద‌క్కుతుంద‌ని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ నొక్కి వ‌క్కాణించారు. గురువారం సోమాజీగూడా విలేఖ‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతు.. తెలంగాణ ఇవ్వాళ ప్రశాంతంగా ఉంది అనడానికి కారణం కేసీఆరేన‌న్నారు. గడిచిన ఆరేళ్లలో ప్రజల మౌలిక అవసరాలను తీర్చడానికి దృష్టి పెట్టామ‌ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ నగరంలో వారానికి ఒకరోజు కూడా త్రాగునీరు వచ్చేవి కాద‌ని నేడు మాత్రం ఆ ప‌రిస్థితి పూర్తిగా మారిన విష‌యాన్ని స్వ‌యానా ప్ర‌జ‌లే గ‌మ‌నిస్తున్నార‌న్నారు.

అప్ప‌ట్లో ఉస్మాన్ సాగ‌ర్.. నేడు కేశ‌వాపూర్

1920లో ఉస్మాన్ సాగర్ కడితే..మళ్ళీ వందేళ్ల తరువాత కేశావాపురం కేసీఆర్ మంచినీళ్ల కోసం నిర్మిస్తున్నార‌న్నారు. దీని ద్వారా శాశ్వ‌తంగా న‌గ‌ర ప్ర‌జ‌ల దాహార్తి తీర‌నుంద‌ని స్ప‌ష్టం చేశారు. హైదరాబాద్ లో ఒకప్పుడు కరెంట్ ఉంటే వార్త, ఇప్పుడు కరెంట్ పోతే వార్త అని ఎద్దేవా చేశారు. గ‌తంలో క‌రెంటు కోత‌ల‌తో జ‌నం ఎలా అల్లాడిన విష‌యం, ప‌రిశ్ర‌మ‌ల‌కు ప‌వ‌ర్ హాలీడేల విష‌యాలు అంద‌రికీ తెలిసిన‌వే అన్నారు. వీట‌న్నింటినీ అధిగ‌మించి ఏర్ప‌డిన కొత్త‌లోనే 24 గంట‌ల విద్యుత్ స‌ర‌ఫ‌రా చేసిన ఘ‌ట‌న కేసీఆర్‌ద‌ని పేర్కొన్నారు.

రాష్ర్టావృద్ధి కోసం 67 వేల కోట్లు ఖ‌ర్చు పెట్టాం

ఇక‌ స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో దేశంలోనే హైదరాబాద్ ఘనత సాధించింద‌ని, నేడు పెట్టుబడులకు అయస్కాంతంగా హైదరాబాద్ మారింద‌ని, దేశంలో ఎక్కడా లేని విధంగా 9వేల 7వందల రూపాయలతో 1లక్ష డబుల్ బెడ్ ఇండ్లు చివరి దశలో ఉన్నాయ‌ని వాటిని నిజ‌మైన నిరుపేద‌లైన ల‌బ్ధిదారుల‌కు అంద‌జేస్తామ‌ని పేర్కొన్నారు. 58,59 జీవో లో 1లక్ష పట్టాలు పేదలకు పంపిణీ చేశామ‌ని, భాగ్య‌న‌గ ర అభివృద్ధికి ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌కు నిరుపేద‌ల కోసం అమ‌లు చేస్తున్న ఆయా సంక్షేమ ప‌థ‌కాల‌కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కూ 67వేల కోట్లు ఖర్చు పెట్టామ‌ని రెండు మూడు రోజుల్లో దానికి సంబంధించిన లిస్ట్నువిడుదల చేస్తామ‌న్నారు.

ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజల దగ్గకు వెళ్లి ధైర్యం చెప్పింది టీఆర్ఎస్ పార్టీయేన‌న్న విష‌యం మ‌రిచిపోవ‌ద్ద‌న్నారు. నాలాల ఆక్రమణ పై ప్రభుత్వం ఇప్ప‌టికే దృష్టి సారించింద‌న్నారు.

త్వ‌ర‌లో క‌ఠినంగా కొత్త జీహెచ్ఎంసీ చ‌ట్టం


త్వ‌ర‌లో జీహెచ్ఎంసీలో ఆక్ర‌మ‌ణ‌ల‌కు సంబంధించి కొత్త చ‌ట్టాన్ని జ‌న‌వ‌రి లేదా ఫిబ్ర‌వ‌రి నెల‌లో తీసుకొని వ‌స్తామ‌ని ఈ చ‌ట్టం ద్వారా ఆక్ర‌మ‌ణ‌ల‌ను ఏ మాత్రం ఉపేక్షించ‌కుండా కూల్చివేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

అంద‌రి హైద‌రాబాదా? కొంద‌రి హైద‌రాబాదా?

మతకల్లోళాల‌కు ప్రయత్నం చేసినా, హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతీసే ప్రయత్నం చేసినా ఉక్కుపాదంతో అణిచివేస్తామ‌న్నారు. అభివృద్ధి కావాలా? అరాచకం కావాలా? అనేది ప్రజలే తేల్చుకోవాల‌న్నారు. అందరి హైదరాబాద్ కావాలా? కొందరి హైదరాబాద్ కావాలా? ప్రధాని అన్న మాటలు హోకల్ ఫర్ లోకల్ అనే నినాద‌మే త‌మ‌ది కూడా!. గోల్కొండ కోట పై ఎప్పుడో జాతీయ ఎగవేశారు…మల్లీ కాషాయా జెండా అవసరం లేద‌ని అన్నారు. కాగా రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవ‌ని, ప్రజలకు ఎవ్వరు నచ్చితే వాళ్ల అధికారంలో ఉంటార‌న్న‌ది అంద‌రికీ తెలిసిందేన‌న్నారు. లాక్ డౌన్ వల్లే ఆర్థిక సంక్షోభం దేశానికి రాలేద‌ని, దానికంటే ముందే సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంద‌న్నారు. గత ఎన్నికల్లో పాతబస్తీలో ఐదు చోట్ల గెలిచామ‌ని ఈ సారి 10సీట్లు గెలుస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఎంఐఎం తో టీఆర్ఎస్‌కు ఎలాంటి పొత్తులు లేవ‌ని, మళ్ళీ టీఆర్ఎస్‌ అభ్యర్థి మేయర్ గా ఎన్నిక కాబోతున్నార‌ని జోస్యం చెప్పారు.

అప్పుడే బీజేపీ ఓట్ల‌గాలి

హైదరాబాద్ అభివృద్ధికి తామేం చేశామో చూపిస్తామ‌ని, మ‌రీ బీజేపీ దేశానికి, రాష్ర్టానికి ఏం చేసిందో? చూపించ‌గ‌ల‌దా? అని చుర‌క‌లంటించారు. బీజేపీ హైదరాబాద్ కు ఎన్ని నిధులు తీసుకురాగ‌ల‌దో ముందు చెప్పి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్‌ ఎవ్వరి బి-టీమ్ కాద‌ని తెలంగాణ ప్రజల ఏ-టీమ్ మాత్రమేన‌ని స్ప‌ష్టం చేశారు. ఇక మ‌రో ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీన పడింద‌ని దానికి కార‌ణం కూడా వారేన‌ని ఇది స్వ‌యంగా చేసుకున్న‌ అపరాధ‌మేన‌ని తేల్చి చెప్పారు.

Related posts

వనపర్తి జిల్లాలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు

Satyam NEWS

ఆపరేషన్ వికటించి ఒక మహిళ మృతి

Satyam NEWS

రోమాలు నిక్కబొడుచుకునేలా సైరా టీజర్

Satyam NEWS

Leave a Comment