32.2 C
Hyderabad
May 12, 2024 20: 25 PM
Slider ప్రత్యేకం

కేటీఆర్ రాక: ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యేలు

కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో రేపు ఐటి, మున్సిపల్ షాక్ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. రెండు నియోజకవర్గాల్లో సుమారు 53 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించనున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 21 కోట్లు, ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 32 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించనున్నారు.

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని బైపాస్ వద్ద నిర్మించిన స్వాగత తోరణం, పట్టణంలో నిర్మించిన ఆరులైన్ల రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఆర్.అండ్.బి గెస్ట్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన పైలాన్ ను అవిష్కరించనున్నారు. మధ్యాహ్నం ఎల్లారెడ్డి పట్టణంలో కేటీఆర్ బహిరంగ సభలో పాల్గొననున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ పరిశీలించారు. ఎల్లారెడ్డిలో 25 వేల మందితో సభ ఏర్పాటు చేయనుండటంతో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తారా..?

మంత్రి కేటీఆర్ ఎక్కడ బహిరంగ సభలో పాల్గొన్న అక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఇటీవల నిజమాబాడ్ జిల్లాలో పర్యటించిన కేటీఆర్ సిట్టింగులను గెలిపించుకోవాలని పిలుపునివ్వడంతో సిట్టింగులకే టికెట్లు అని ప్రకటించనట్లయింది. అలాగే కామారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే సీట్లపై సందిగ్ధం నెలకొంది. ముఖ్యంగా కామారెడ్డి అసెంబ్లీ నుంచి గత కొద్దిరోజులుగా సీఎం కేసీఆర్ పోటీలో నిల్వనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. సీఎం కేసీఆర్ ను పోటీ చేయాల్సిందిగా తానే స్వయంగా ఆహ్వానించానని విప్ గంప గోవర్ధన్ తెలిపారు. అయినా కేసీఆర్ పోటీపై అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఈసారి ఓడిపోవడం ఖాయమని తెలిసాకే కేసీఆర్ ను పోటీ చేయాలని ఆహ్వానించారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆరోపిస్తున్నారు. రేపటి కేటీఆర్ పర్యటనతో జిల్లాలో సిట్టింగులకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా లేక ఇతరులకు కేటాయిస్తారా అనే విషయంపై క్లారిటీ రానుంది.

Related posts

ఫిబ్రవరికి యూరప్‌లో 5 లక్షల మరణాలు డబ్ల్యూహెచ్ఓ

Sub Editor

అమిత్ షా ను కలవనున్న తిరుగుబాటు ఎంపి?

Satyam NEWS

Analysis: ఆషామాషీగా తీసుకుంటే మఠాష్

Satyam NEWS

Leave a Comment