27.7 C
Hyderabad
May 4, 2024 10: 58 AM
Slider నల్గొండ

మను ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించాలి

#Kulavivakshaporatasamithi

సమాజ మనుగడకు అడ్డంకిగా ఉన్న మను ధర్మశాస్త్రం ను తీవ్రంగా వ్యతిరేకించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జిట్ట నగేష్ విజ్ఞప్తి చేశారు. నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల లో శుక్రవారం నాడు కె.వి.పి.యస్ ఆధ్వర్యంలో మను ధర్మశాస్త్ర ప్రతులను దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ దళితులకు, మహిళలకు విద్య నేర్చుకునే అవకాశం లేదని చెప్పే మను ధర్మశాస్త్రం వద్దని 1927 డిసెంబర్ 25వ తేదీ న డా.బీ ఆర్ అంబేద్కర్ ప్రతులను తగలబెట్టారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలను పాలక పార్టీలు  నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు.

భారత రాజ్యాంగం ను రక్షించుకోవలసిన అవసరం బడుగు బలహీన వర్గాల ప్రజలపై ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో చేతి వృత్తి దారుల సంఘం జిల్లా కార్యదర్శి అవిశెట్టి శంకరయ్య, కె.వి.పి.యస్ మండల అధ్యక్ష,కార్యదర్శులు మందుగుల యాదయ్య,

బడే అజయ్ కుమార్, బొడ్డు బాబురావు, పంది నరేష్, ఈసం రాజు, వివిధ ప్రజా సంఘాల నాయకులు కత్తుల లింగస్వామి, మెట్టు నర్సింహ, పరమేష్, గోపగోని వెంకన్న, జిట్ట సరోజ, ఐతరాజు నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అన్ని రంగాల్లో ఘన విజయం సాధిస్తున్న మహిళలు

Satyam NEWS

వివేకా హత్య కేసులో సీబీఐ పై ఫిర్యాదు చేసిన గంగాధర్ రెడ్డి

Satyam NEWS

కరెంటు ఎందుకు పోతుంది? బిల్లులు ఎందుకు పెరుగుతున్నాయి?

Satyam NEWS

Leave a Comment