28.7 C
Hyderabad
April 28, 2024 05: 03 AM
Slider గుంటూరు

కరెంటు ఎందుకు పోతుంది? బిల్లులు ఎందుకు పెరుగుతున్నాయి?

#chadalawada

కరెంటు ఎందుకు పోతుంది? బిల్లులు ఎందుకు పెరుగుతున్నాయో రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి నోరు విప్పి సమాధానం చెప్పాలని నరసరావుపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు. నరసరావుపేట పట్టణ శివారులోని ఇస్సాపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ ప్రజా చైతన్య యాత్ర లో స్థానిక టిడిపి నాయకులతో కలిసి గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డా౹౹చదలవాడ మాట్లాడుతూ రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లి పోయిందన్నారు.ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారు అని అన్నారు.

ఫ్యాన్ కు ఓటేశారు అదే ఫ్యాన్ కు ఉరేసుకునే పరిస్థితిలో రాష్ట్ర ప్రజానీకం ఉంది. రాష్ట్ర ప్రజలకు ఫ్యాన్ రెక్కలే కత్తులుగా మారాయి అని విమర్శించారు.వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ, అప్రకటిత విద్యుత్ కోతలను నిలుపుదల చేయాలంటూ కీసర గ్రామంలో ఇంటింటికి ప్రతి ఒక్కరికి అగ్గిపెట్టెలను, కొవ్వొత్తులు అందజేశారు. రాష్ట్ర రైతాంగం కన్నీరుమున్నీరవుతుంది రైతు గోడును పట్టించుకునే నాధుడే లేడని ఎద్దేవా చేశారు.

నిత్యవసరాలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు సామాన్యుడికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి అని అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే బొమ్మ అర్థమైపోయింది మొన్న జరిగిన ప్లీనరీ సమావేశంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు మీ మీ స్థానాలు తప్పనిసరిగా గెలవాలని గీతోపదేశం చేస్తున్నాడని గ్రామాలలో అధికార పార్టీ నాయకులు తిరగాలంటే వాళ్లందరికీ వినిపిస్తున్న పాట ఒకటే ప్రజలందరూ బాదుడే.. బాదుడు…అని విమర్శించారు.

తెలుగుదేశం పార్టీ ఉత్సాహం చూస్తుంటే నూతనోత్సాహం కనబడుతుంది.ప్రతి ఒక్కరు రానున్న ఎన్నికలలో రెట్టింపు ఉత్సాహంతో  కలిసికట్టుగా పని చేయాలి అని పిలుపునిచ్చారు.రాష్ట్రంలో వైసీపీ పార్టీకి చరమగీతం పాడి మన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రిగా చేసే వరకు అందరూ శక్తివంచన లేకుండా కష్టపడదాం అన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వేములపల్లి వెంకట నరసయ్య,పమిడి జగన్నాథం,మక్కన ఆంజనేయులు, పోలయ్య, నాగోతు ప్రకాష్,నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాష్ట్రంలో పైశాచిక పాలన సాగుతోంది

Bhavani

ప్రశ్నాపత్రాలు లీక్ అవుతుంటే కేటీఆర్ ఏంచేస్తున్నారు?

Satyam NEWS

నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి

Satyam NEWS

Leave a Comment