34.7 C
Hyderabad
May 4, 2024 23: 26 PM
Slider వరంగల్

ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క పేరు పెట్టాలి – komaram bheem

#Komaram Bheem 2

ములుగు జిల్లా కు సమ్మక్క సారక్క పేరు పెట్టాలని ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ముంజల భిక్షపతి గౌడ్ డిమాండ్ చేశారు.

ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాంప్లెక్స్ ఆవరణలో ఆదివాసి ఉద్యోగుల, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నేడు కొమురం భీం 80 వర్ధంతి సభ ఘనంగా నిర్వహించారు.

డి ఎల్ ఆర్ ఫంక్షన్ హాల్ నుండి ఎస్సీ కాంప్లెక్స్ వరకు డప్పు చప్పుళ్ళ మధ్య డోలు వాయిద్యాల మధ్య భారీ ర్యాలీ నిర్వహించారు.

వర్ధంతి సభకు ముఖ్య అతిథిగా ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య హాజరయ్యారు. ఆదివాసి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోదేం కృష్ణ ప్రసాద్ అధ్యక్షత వహించారు.

ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ అల్లం అప్పయ్య, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ పోరిక రవీందర్, ఆదివాసి నాయక పోడు సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు దబ్బ సుధాకర్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి నెమలి నరసయ్య,

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జన్ను రవి మాదిగ, ఆదివాసి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మంకిడి రవి, టీ జేఏసీ జిల్లా కన్వీనర్ చాప బాబు దొర,

ఎమ్మార్పీఎస్ ములుగు జిల్లా నాయకులు వావిలాల స్వామి, సింధు హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గడ్డ వెంకటేశ్వర్లు, ఆదివాసి నాయకపోడు సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు కూన శివారం కొత్త సదానందం

కొత్త లక్ష్మయ్య ఆదివాసీ నాయకపోడు సంఘం నాయకురాలు బద్దుల లక్ష్మి సరోజన మోరి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ములుగు జిల్లా కు సమ్మక్క సారక్క పేరు పెట్టే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని కలెక్టర్ అన్నారు.

Related posts

ధరణి సమస్యల అధ్యయనం పరిష్కారం పై సమీక్ష: మంత్రి హరీశ్ రావు

Satyam NEWS

జనసేన అధినేత పర్యటన కు ముందు గానే జగన్ ప్రభుత్వం అలెర్ట్

Satyam NEWS

హత్యకు వివాహేతర సంబంధమే కారణమా?

Sub Editor

Leave a Comment