28.7 C
Hyderabad
April 26, 2024 08: 34 AM
Slider నల్గొండ

హుజూర్ నగర్ లో ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి

#Hujurabad Congress

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ 36 వవర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఇందిరా సెంటర్ లోని ఇందిరా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ  జాయింట్ సెక్రెటరీ ఎండి పాషా, మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇందిరా గాంధీ భారతదేశ ప్రధానిగా ఎనలేని సేవలు అందించారని, ‘గరీబీ హటావో’ నినాదంతో పేదరికాన్ని రూపుమాపేందుకు ఎనలేని కృషి చేశారని అన్నారు. బ్యాంకుల ఏకీకరణ, 20 సూత్రాల పథకాలతో దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు.

ఇందిరాగాంధీ చేసిన  సేవలను ఎన్నటికీ మరువలేనివని, ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు.”భారతరత్న” పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి మహిళ ఇందిరాగాంధీ కావడం గర్వకారణమని అన్నారు. భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటి మహిళా దేశ ప్రధానిగా రికార్డు సృష్టించిన ఇందిరా గాంధీ ఆదర్శం కావాలని అన్నారు.

“స్త్రీలలో కూడా గొప్ప శక్తి సామర్ధ్యాలు ఉంటాయని నేను ఊహించలేదు” అన్న నాటి ఫ్రెంచ్ అధ్యక్షుడు చార్లెస్ డిగాలే అన్న మాటలను నాయకులు గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో  ములకలపల్లి రామగోపి, కారంగుల విజయ వెంకటేశ్వర్లు, ముశం సత్యనారాయణ, కోల మట్టయ్య, మేళ్లచెరువు ముక్కంటి, పోతుల జ్ఞానయ్య, లచ్చిమళ్ళ నాగేశ్వరరావు, యడవెల్లి వీరబాబు, కస్తాల సైదులు, జింజిరాల సైదులు,

చప్పిడి సావిత్రి, రొట్టెముక్కల రాములు, సంక్రాంతి కోటేశ్వరరావు, అజ్మతుల్లా, పాశం నారాయణ, దాసరి రాములు, కె. సైదులు, ఆవుల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

31 న వ‌ర్చువ‌ల్ విధానంలో విజయనగరం వైద్య క‌ళాశాల శంకుస్థాప‌న‌

Satyam NEWS

బస్సు ఛార్జీల పెంపుపై కాంగ్రెస్ ధర్నా

Satyam NEWS

తిరుమల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా రేపు విడుదల

Satyam NEWS

Leave a Comment