28.7 C
Hyderabad
April 27, 2024 04: 45 AM
Slider విజయనగరం

జనసేన అధినేత పర్యటన కు ముందు గానే జగన్ ప్రభుత్వం అలెర్ట్

#kolagatla

గడచిన వారంలో ఏపీ రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గుంటూరు జిల్లాలో చేసిన ఆందోళన పధం కాస్త… అధికార పార్టీ లో కాస్త.. చూసుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని అంటోంది…”సత్యం న్యూస్. నెట్.”.గుంటూరు జిల్లా ఇప్పటంలో జనసేన పార్టీ అధ్యక్షుడు…నడుచుకుంటూ…ఏఎస్పీ అనిల్…డీఎస్పీ లు వారిస్తున్నా… వినకుండా… ఆవేశం తో అక్కడ రగిల్చిన చిచ్చు… దీనికి తోడు… విశాఖ లో దేశ ప్రధాని మోడీతో ప్రత్యేకంగా 35 నిమిషాలు పవన్ భేటి తో..అధికార పార్టీ లో కాసిన్ని రైళ్లు పడిగెట్టాయనే చెప్పాలి.

ఉత్తరాంధ్ర లో అడుగు పెట్టిన పవన్… విజయనగరం జిల్లా మ కేంద్రానికి అనుకుని ఉన్న గుంకలాం లో “జగనన్న కాలనీ’..పరిశీలిస్తారని సమాచారం అందడంతో… స్థానిక ఎమ్మెల్యే… డిప్యూటీ స్పీకర్ కోలగట్ల సన్నద్ధం అయ్యారు. అనుకున్న మాట ప్రకారం… మాట తప్పని-మడిమ తిప్పని…సీఎం జగన్ తండ్రి బాటలోనే పయనిస్తూ..ఇచ్చిన మాట..హామీ ప్రకారం.. నవరత్నాల లో భాగంగా పెదలందరిక పక్కగా ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారని..మీడియా సాక్షిగా… గుంకలాం లో జరుగుతున్న 12 వేల ఇండ్ల నిర్మాణ పనులను దగ్గరుండి చూపించారు. .డిప్యూటీ స్పీకర్ కోలగట్ల.

పేదవాడి కి ఇంటి నిర్మాణం భారం కాకూడదనే..ఉచితంగా ఇచ్చిన స్థలంలో లక్ష రూపాయలు ఇచ్చి…అక్కడికి ఇంటి నిర్మాణం కు అయ్యే సిమెంట్, ఇసుక, ఐరన్ సిద్ధం చేసి సీఎం జగన్ ఇండ్లను కట్టిమరీ ఇస్తున్నారని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల మీడియాకు కళ్లకు కట్టినట్లు.. దగ్గరుండి ప్రత్యక్షంగా చూపించారు. అయితే ముందు గానే. గుంకలాం కు వచ్చిన జనసేన పార్టీ కార్యకర్తలు..లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణం కష్టం గా ఉందని పవన్ కు చెప్పాలంటూ తర్ఫీదు ఇవ్వడంతో ఆ పార్టీ వ్యవహార శైలి ఏంటో తెలిసిందన్నారు…డిప్యూటీ స్పీకర్ కోలగట్ల.

కరోనా తో రెండు న్నర ఏళ్ల వ్యవధిలో.. ఇండ్ల నిర్మాణం ఆగిందే తప్ప…మరేఇదర కారణాలు కాదన్నారు. పేదడికి భారం కాకూడదనే… లబ్దిదారుని స్థలానికి… అన్నీ తమ ప్రభుత్వం సమకూర్చుతోందని…డిప్యూటీ స్పీకర్ కోలగట్ల అన్నారు. ఇండ్ల నిర్మాణం పరిశీలనకు జనసేన అధినేత పవన్ నిరభ్యంతరంగా రావొచ్చని….తాము స్వాగతం పలుకుతామన్నారు.

అధికారులు కు కూడా చెబుతున్నానని..పవన్ కల్యాణ్ వస్తుండటంతో మరమ్మతులకు గురైన రోడ్ల ను కూడా తక్షణమే బాగు చేయ్యాలన్నారు…డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. విజయనగరం నియోజకవర్గ ప్రజలు… శాంతి కాముకులని…ఎన్నికల ఉన్నంత వరకే రాజకీయాలు మాట్లాడతారని..అనంతరం అందరూ వాటిని మరచి.. సమైక్యంగా కలిసే అభివృద్ధి పనుల్లో పాలు పంచుకుంటారని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల అన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా

Related posts

ధర్మారెడ్డి, పిలాయిపల్లి కాలువల పూర్తిలో అలసత్వం వద్దు

Satyam NEWS

వెంకటగిరి పెన్సిల్ చిత్రకళాకారుడు పొలిశెట్టి శంకర్ కు మరో పురస్కారం

Satyam NEWS

సోమును తీసేయకపోతే బీజేపీ బతకడం కష్టం

Satyam NEWS

Leave a Comment