38.2 C
Hyderabad
May 3, 2024 22: 44 PM
Slider కడప

కువైట్ హెల్పింగ్ హ్యాండ్ ఆక్సిజన్ సిలిండర్లు వితరణ

#KuwaitHelpingHand

కువైట్ హెల్పింగ్ హ్యాండ్ సహకారంతో గురువారం 50 వేలు విలువ చేసే నాలుగు ఆక్సిజన్ సిలిండర్లను కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి అందజేసారు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ చేతుల మీదుగా ఆసుపత్రి ఇంచార్జ్ అనిల్ కుమార్ కు అందజేశారు.

ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంట్ ఇంచార్జీ ముఖరం మాట్లాడుతూ  రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

అందులో భాగంగానే  రాజంపేట పట్టణంలోని ప్రభుత్వ కోడ్ సెంటర్ కు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జనసేన ఆధ్వర్యంలో ఆక్సిజన్ సిలిండర్ అందించామని చెప్పారు. ప్రజలకు దూరంగా ఉంటూ వారి కష్టాలకు ఆదుకునే ఏకైక పార్టీ జనసేన అన్నారు.

రాజంపేట నియోజకవర్గంలో అసెంబ్లీ ఇన్చార్జి వెంకటరమణ ఆధ్వర్యంలో జనసేన నాయకులు ప్రజలకు అండగా నిలుస్తూ పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఎద్దుల పవన్, బండ్ల రాజేష్, న్యాయవాది కత్తి సుబ్బయ్య, రామయ్య, సుబ్రహ్మణ్యం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

[Over The Counter] Buy Volume Pills Best Otc Sex Pill

Bhavani

40 మంది దళితబంధు లబ్దిదారులకు మంజూరు పత్రాల అందజేత

Satyam NEWS

దేశాన్ని దోచుకుతింటున్న గుజారాతీలు

Satyam NEWS

Leave a Comment