27.7 C
Hyderabad
May 4, 2024 08: 50 AM
Slider మహబూబ్ నగర్

ప్రతి ప్రైవేట్ ల్యాబ్ ధరల పట్టికను తప్పనిసరిగా ప్రకటించాలి

#achempet

ప్రైవేటు డయాగ్నొస్టిక్ సెంటర్ల నిర్వాహకుల సమావేశాన్ని నాగర్ కర్నూల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే. సుధాకర్ అచ్చంపేట టీఎన్జీవోస్ సమావేశ మందిరంలో నిర్వహించారు. వర్ష కాలంలో కలుషితమైన నీరు, ఆహారం ద్వారా నీళ్ళ విరేచనాలు, టైఫాయిడ్ వ్యాధులు, దోమకాటు ద్వారా డెంగు మలేరియా తదితర జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కావున అర్హులైన వైద్యులు సూచించినప్పుడు మాత్రమే రక్త,మూత్ర పరీక్షలు చేయాలని, బయట సూచించిన ధరల పట్టిక  ప్రకారమే డబ్బులు వసూలు చేయాలని, అధిక ధరలు తీసుకోకూడదు అని సూచించారు. ఎవరైనా అధిక ధరలు వసూలు చేసినట్టు అయితే అటువంటి ల్యాబ్ నిర్వహకులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి డయాగ్నస్టిక్స్ సెంటర్ ఆసుపత్రులు ,క్లినికులు కచ్చితంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా అనుమతులు పొందాలని కఠినమైన చర్యలు తీసుకుంటామని, మూసివేయడం జరుగుతుందని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తారా సింగ్, డివిజనల్ ఉప మలేరియా అధికారి అశోక్ ప్రసాద్, DDM  సందీప్,  ఓ. శ్రీను ప్రైవేటు క్లినిక్ లు ల్యాబ్ లు ఆసుపత్రులు మరియు డయాగ్నొస్టిక్ ఇలా నిర్వాహకులు ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు.

Related posts

తెలుగు, ఉర్దు భాషల్ని వదిలేస్తామంటే ఊరుకోం

Satyam NEWS

మెర్సిలెస్ మదర్: ముగ్గురు ఆడ పిల్లల్ని చంపిన తల్లి

Satyam NEWS

అపరంజి చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం

Satyam NEWS

Leave a Comment