29.7 C
Hyderabad
May 4, 2024 05: 45 AM
Slider కడప

కేసీకెనాల్ భూమి ఆక్రమిస్తున్న అధికార పార్టీ నేతలు

#KC Canal land

రెండు ఎకరాల భూమి సాగు పేరుతో ఐదు కోట్ల విలువ చేసే కేసీ కెనాల్ భూమిని ఆక్రమించేందుకు అధికారులు అధికార పార్టీ నేతలు పక్కా ప్రణాళిక సిద్ధం చేశారని సిపిఐ కడప జిల్లా కార్యదర్శి గాలి చంద్ర ఆరోపించారు. కడప నగరం పాలంపల్లె గ్రామ పొలం, పాలం పల్లె – బచ్చుం పల్లె ఇసుక గడ్డ (కేసీ కెనాల్) పంట కాలువకు ఉత్తర దిక్కున రామనపల్లె

రోడ్డు నుండి ఐదు కోట్ల విలువ చేసే రెండు ఎకరాల కేసి కెనాల్ స్థలాన్ని వ్యవసాయ పనుల పేరుతో అధికార పార్టీకి చెందిన ఒక వ్యక్తి ఆక్రమించి తన భూమి వరకు రోడ్డు వేసుకునేందుకు కేసీ కెనాల్ అధికారులు అనుమతి ఇచ్చి కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కొట్టేసెందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేశారని ఆయన అన్నారు.

అదే భూమిలో గత అనేక దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నా రైతులతో కలిసి సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర వెళ్లి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికార పార్టీ నేతల పేర్లు చెప్పుకుంటూ ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్లు వేసి అమాయకులకు కట్టబెట్టి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారన్నారు.

అంతటితో ఆగకుండా ఒక ఎకరా ప్రైవేటు పట్టా భూమి కొనుగోలు చేసి పక్కనే ఉన్న విలువైన ప్రభుత్వ వంకా వాగు చెరువు రస్తా దేవాదాయ వక్ఫ్ అసైన్డ్ ఈనామ్ భూములను కలుపుకొని అమ్ముకొని సొమ్ము చేసుకోనేందుకు అధికారులు అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్నారు. నిజంగా రైతులు పంట పొలాలకు గతంలో వేసిన రోడ్డు

దెబ్బతిన్నాయని అధికారులు ప్రజా ప్రతినిధులను కలిసి అనేక పర్యాయాలు విన్నవించిన పట్టించుకోని ప్రభుత్వం వ్యవసాయం రైతుల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం ఆగ మేఘాల మీద అనుమతులు ఇచ్చి ఇదివరకే సాగు చేసుకుంటున్న పేద రైతుల నోట్లో మట్టి కొట్టడానికి ఎంతవరకు సమంజసం అని వారు విమర్శించారు.

నగరంలో కేసీ కెనాల్ ఇరువైపులా ఉన్న పరం పోగు స్థలాలను కేసీ కెనాల్ అధికారులు హోల్సేల్గా అమ్మకానికి పెట్టారని వారి ఆరోపించారు. ఇప్పటికైనా వైఖరి మార్చుకోకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Related posts

సర్వే నిజం:మున్సిపాలిటీపై తెరాస జెండా చైర్మన్ గా కొండ శ్రీలత

Satyam NEWS

వనపర్తిలో జిల్లా పోలీస్ కార్యాలయం భవనం ప్రారంభం

Satyam NEWS

లార్డ్ బాలాజీ:జమ్ముకశ్మీర్‌లో వెంకన్న ఆలయం

Satyam NEWS

Leave a Comment