37.2 C
Hyderabad
May 6, 2024 19: 08 PM
Slider విజయనగరం

చిన్నారులను అక్కున చేర్చుకున్న రూరల్ పోలీసులు..!

#police

పోలీసు అంటే కఠిన పాషాణ హృదయులు…ఖాకీ లంటే మానవత్వాన్ని ఆమడదూరంలో ఉంచుతారని పేరు. విజయనగరం జిల్లా లో అందున రూరల్ పోలీసులకు పైన ఉదహరించిన రెండు గుణాలను అల్లంత దూరంలో ఉంచారనే చెప్పాలి. ఎందుచేతనంటే…దిక్కుతోచని,ఎవ్వరూ లేనిదే ఇద్దరు చిన్నారులను గుర్తించారు… విజయనగరం రూరల్ పోలీసులు. నగర సమీపంలో ముడిదాం వద్ద లార్విన్ స్కూల్ వద్ద బుజ్జమ్మ ,చిన్నారిలను గుర్తించిన విజయనగరం రూరల్ సీఐ తిరుపతి రావు ,ఎస్ఐ గణేష్ లు..చిన్నారుల కన్నవాళ్ల చిరునామా లను అడిగే యత్నం చేశారు. పిల్లలు చెప్పలేని పరిస్థితుల్లో ఉండటం చూసి న సీఐ తిరుపతి రావు…వాళ్ళ దాహార్తిని ముందు తీర్చారు.తక్షణమే రెండు కూల్ డ్రింక్ బాటిల్స్ ను ఆ ఇద్దరు చిన్నారులకు ఇచ్చారు. ఆ తర్వాత వివరాలు సేకరించే యత్నాలు చేశారు. కానీ పోలీసులు చర్యలు నిష్పలం అయ్యాయి.చిరునామాలు చెప్పలేక పోవడంతో వెనువెంటనే చైల్డ్ హోమ్ కు చిన్నారులను తరలించారు….సీఐ తిరుపతి రావు…ఈ చర్యలతో పోలీసులలో మానవత్వం కాస్తైన ఉందని నిరూపించారంటోంది…”సత్యం న్యూస్. నెట్”.

Related posts

ట్రోల్స్: వెనుక నుండి పట్టవద్దు ముందు నుండి దొరకవద్దు

Satyam NEWS

నినాదాలతో హోరెత్తుతున్న ఏపీ అసెంబ్లీ

Satyam NEWS

వి ఎస్ యు లో 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం

Satyam NEWS

Leave a Comment