24.7 C
Hyderabad
March 26, 2025 10: 28 AM
Slider ముఖ్యంశాలు

తిరుమ‌ల‌లో మ‌ళ్లీ క‌నిపించిన చిరుత‌

#Leopard

తిరుమలలో మ‌ళ్లీ చిరుత క‌నిపించి క‌ల‌క‌లం సృష్టించింది. దీంతో భక్తులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఘాట్ రోడ్డులోని 56 వ మలుపు వద్ద చిరుత కనిపించింది. అప్రమత్తమైన అటవీ అధికారులు వాహనదారులను గుంపులుగా పంపిస్తున్నారు. చిరుతను దారి మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ మ‌ధ్య‌నే అలిపిరి నడక దాడిలో ఓ బాలుడిపై చిరుత దాడి చేసింది. కర్నూలు జిల్లా ఆదోనీకి చెందిన నాలుగేళ్ల కౌశిక్ ను చిరుత నోట కరిచి తీసుకెళ్లింది. పోలీస్ ఔట్ పోస్ట్ వద్ద బాలుడిని విడిచిపెట్టింది. ఈ ఘటనలో బాలుడి చెవి వెనుక, తలపై గాయాలయ్యాయి. ఈ ఘటన మరవకముందే మ‌ళ్లీ తిరుమ‌ల దారిలో చిరుత క‌నిపించ‌డంతో అంద‌రిలో భ‌యం నెల‌కొంది.

Related posts

రాజీవ్ గాంధీ హత్య కేసు దోషుల విడుదలకు ఆదేశం

Murali Krishna

కరడుకట్టిన గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసిన కృష్ణా జిల్లా పోలీసులు

mamatha

అధికార లాంఛనాలతో పోలీసు జాగిలం “రాకీ” కి అంత్యక్రియలు

Satyam NEWS

Leave a Comment