40.2 C
Hyderabad
April 26, 2024 14: 20 PM
Slider ప్రత్యేకం

ఎస్సీ సబ్ ప్లాన్ అమలు గడువును పొడిగించాలి

#chandrababu

ఎస్సీ ఉప ప్రణాళిక  సమయం వచ్చే ఏడాది జనవరితో గడువు ముగుస్తుండగా ఇంత వరకు ఆ నిధులు దళితుల దరి చేరలేదని తక్షణమే ఎస్సీ ఉప ప్రణాళిక గడువును మరో పది సంవత్సరాలు పెంచే విధంగా కేంద్రంపై ఒత్తిడితేవాలని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డా॥గోదా రమేష్ కుమార్ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను కోరారు. మంగళగిరిలోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో నరసరావుపేట టీడీపీ ఇన్ ఛార్జ్ డా॥చదలవాడ అరవిందబాబుతో కలసి చంద్రబాబుకు వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సంధర్భంగా రమేష్ కుమార్ రాష్ట్రంలో పలు పధకాలు ప్రభుత్వం అమలు చేయకపోవడంతో ఎస్సీ,ఎస్టీ,బీసీ,ముస్లీం,మైనార్టీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారని చంద్రబాబుకు తెలిపారు. ఎస్సీలకు సంబంధించిన 17రకాల పథకాలను ప్రభుత్వం రద్దు చేసి దళితుల అభివృద్దిని అడ్డుకుంటుందని అన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం  పూర్తిగా విఫలమైందని రొంపిచర్ల మండలంలోని పలు గ్రామాలలో వర్షాలకు పంటదెబ్బతిని రైతులు ఇబ్బందులు పడుతుంటే అధికారులు,ప్రభుత్వం పట్టించుకోలేదని  తెలిపారు.

నరసరావుపేటలో ఎం ఐ ఎం పార్టీ నేత షేక్ మస్తాన్ వలి పుట్టుకతో దివ్యాంగుడని ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రశ్నించిన మస్తాన్ వలిపై అక్రమంగా గంజాయి కేసు బనాయించారని మస్తాన్ వలి ని అక్రమ కేసు నుండి విడిపించేందుకు టీడీపీ తరఫున సంపూర్ణ మద్దతు తెలపాలని కోరుతున్నామని తెలిపారు. కుటుంబంలో ఎవరైనా ప్రమాదవ శాత్తు చనిపోతే 5లక్షలు రూపాయలు,సాధారణంగా చనిపోయిన వ్యక్తి కుటుంబాలకు 2లక్షలు రూపాయలు గత టీడీపీ ప్రభుత్వంలో అందించేవారని మృతుల కుటుంబాలకు ఎంతో ఆసరాగా ఉండే ప్రమాధ భీమా పధకాన్ని  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక  పూర్తిగా రద్దు చేసిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వివాహ ప్రోత్సహకాలు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు.

గత ప్రభుత్వాలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కుటుంబంలో చదివే ప్రతి ఒక్కరికి ఫీజు రియంబర్స్ మెంట్ వర్తించేదని ప్రస్తుత వైసీపీ ఫీజు రియంబర్స్ మెంట్ రద్దు చేసి కుటుంబంలో చదివే ఒకరికి మాత్రమే అమ్మఒడి లేదా విద్యా దీవెన పధకం వర్తించేలా చర్యలు చేపట్టే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎం ఐ ఎం పార్టీ నాయకులు షేక్ కరిముల్లా,షేక్ మౌలాలి,షేక్ నాగూర్,బీసీ సంక్షేమ సంఘం నాయకులు బాలాజీ,గురువులు,గోదా వజ్రబాబు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సిఎం వైఎస్ జగన్ తో ఆకేపాటి భేటీ

Satyam NEWS

కరోనా యాంటీ బాడీలతో పుట్టిన సింగపూర్ బిడ్డ

Satyam NEWS

మండలి ఎన్నికల్లో కూడా ఓటర్ల కొనుగోలు దురదృష్టకరం

Satyam NEWS

Leave a Comment