23.2 C
Hyderabad
May 7, 2024 21: 51 PM
Slider కవి ప్రపంచం

సర్వ జనామోదం  

#jvkumarchepuri

వేదాలు, ఉపనిషత్తుల లోని విజ్ఞానం

పునాదిగ అవతరించె  హైందవ ధర్మం

పరిఢవిల్లిన సనాతన హిందూ ధర్మయుగం

ఉరకలేసే నదీ ప్రవాహం హైందవ ధర్మం

అడ్డంకులు దాటి చేరును మోక్ష సాగరం

అన్య మతాలతో దానికి లేదు సారూప్యం

హైందవ ధర్మం కోరదెన్నడు హింసా ద్వేషం

అహింస, సహనం హైందవ ధర్మ సారం

పంచభూతాలు దైవాలని నమ్మిన ధర్మం

చెట్టు పుట్ట, పర్యావరణాన్ని ప్రేమించే ధర్మం

దేవుడు ఒక్కడే అన్న అన్య మతాల ప్రచారం

హిందూ ధర్మాన్ని మతంగా మార్చింది సత్యం

అనైతిక రణాలకు దూరం హిందూ ధర్మం

ఆత్మ రక్షణ కోసం మాత్రమే చేసింది రణం

దురాక్రమణకై  కాలెన్నడు దువ్వలేదు నిజం

నరేంద్రుడు ఇచ్చిన  హిందూ ధర్మోపన్యాసం

విదేశీ పండిత పామరులను మెప్పించె సత్యం

పొందెను విశ్వ జనులను ఏకగ్రీవామోదం

నేడెందరో తెల్లవాళ్లు అనుసరిస్తున్న వైనం

క్షమ, ఓర్పు, దయ  హిందూ ధర్మ లక్షణం

హిందూ ధర్మానికి సాటి లేదు ఇల మరే మతం

అది హిందూ ధర్మంలో దాగి వున్న  ఔన్నత్యం

హిందువుగా పుట్టినందుకు గర్వించాలి మనం

జె వి కుమార్ చేపూరి, శేరిలింగంపల్లి,  హైదరాబాద్ – 500 019, చలన భాషిణి : 96407 12062

Related posts

21న సీతారాముల కల్యాణోత్సవానికి భద్రాచలం సిద్ధం

Satyam NEWS

నీట్, జేఈఈ విద్యార్థుల కోసం 320 ఫైనల్ గ్రాండ్ టెస్ట్స్ సిద్ధం

Satyam NEWS

వ్యాపారవేత్త జ్యోతికి కేంద్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవి

Satyam NEWS

Leave a Comment