40.2 C
Hyderabad
April 29, 2024 17: 29 PM
Slider నల్గొండ

ఆపద సమయంలో ఆదుకున్న వారే ఆత్మీయ మిత్రులు

#Jana Chaitanya Trust

రెండు నిరుపేద వృద్ధ కుటుంబాలకు జనచైతన్య ట్రస్ట్ తరుపున ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం,నిత్యావసర సరుకులు అందజేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని తిలక్ నగర్ 14 వార్డులో పెండ్ర చిన్నా రెండు కిడ్నీలు పాడై పోయి,తన భార్య వెంకటమ్మ కాలు ఇరగటంతో,మరొక వృద్ధ దంపతులు సొంత ఇల్లు లేక పణిగిరి రామస్వామి గుట్టవద్ద నివాసం ఉంటూ వయసు పైబడి ఇల్లు గడవక ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న జన చైతన్య ట్రస్ట్ సభ్యులు బుధవారం రెండు కుటుంబాలకు చెరో 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు.

యరగని మంగమ్మ,గురవయ్య కుమారుడు నరేష్ పుట్టినరోజు సందర్బంగా జనచైతన్య ట్రస్ట్ ని సంప్రదించి 50 కేజీల బియ్యం,నిత్యావసర సరుకులు జనచైతన్య ట్రస్ట్ కి అందజేయగా నిస్వార్ధ సేవా దృక్పథంతో జనచైతన్య ట్రస్ట్ సభ్యులు వాటిని పూట గడవని రెండు కుటుంబాలకు అందించారు.

ఈ సందర్భంగా జనచైతన్య ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ యరగని మంగమ్మ,గురవయ్య దంపతులను ఆదర్శంగా తీసుకొని తమతమ జీవితంలోని సంతోష క్షణాలను మరొక పేద కుంటుంబానికి సాయం చేస్తూ తమ పిల్లల పుట్టినరోజు,పెళ్లిరోజులను మరో మధుర జ్ఞాపకంగా నలుగురికి ఆదర్శంగా నిలవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్ పినపారాళ్ల వంశీ, అధ్యక్షుడు పారా సాయి, పిల్లి శివశంకర్,దగ్గుపాటి రమేష్,బి.వి. శ్రీపతి,బాబురావు,ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

స్మార్ట్ పోలీసింగ్, సాంకేతిక పరిజ్ఞానంలో దేశంలోనే తెలంగాణ పోలీస్ ఆదర్శం

Satyam NEWS

ఆదివాసీల భూములు తిరిగి ఇప్పించండి

Satyam NEWS

మలుపులో చెట్టును ఢీకొట్టి బోల్తాపడ్డ లారీతో ఇద్దరి మృతి

Satyam NEWS

Leave a Comment