38.2 C
Hyderabad
May 5, 2024 22: 27 PM
Slider నల్గొండ

చిరు వ్యాపారస్తులకు బ్యాంకు రుణాలు ఇవ్వాలి

#Congress Party Hujurnagar

సుమారు డెబ్బై రోజులుగా లాక్డౌన్ విధించటం వ్యాపార రంగంపై తీవ్ర ప్రభావం చూపిందని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి అజీజ్ పాషా అన్నారు. వివిధ రంగాల చిరు వ్యాపారులు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంఘటనలు ఉన్నాయని ఆయన అన్నారు.

ముఖ్యంగా చిరు వీధి వ్యాపారస్తులు వారి కుటుంబ పోషణ కూడా చేసుకోలేని దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అని పేర్కొన్నారు. ఈ చిరు వ్యాపారస్తులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, వారికి ఆర్థిక పెట్టుబడి సహాయం కింద కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఆర్థిక ప్యాకేజీ విడుదల చేయాలని ఆయన కోరారు.

చిరు వ్యాపారస్తులు వివిధ బ్యాంకుల ద్వారా  ముప్పై వేల నుంచి ఒక లక్ష రూపాయల వరకు ఋణాలు తీసుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. షరతులు లేకుండా వారి పెట్టుబడులకు ముద్ర ఋణాలు ఇవ్వాలని, దీనికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని చిరు వీధి వ్యాపారస్తులను ఆదుకోవాలని అజీజ్ పాషా కోరారు.

అలాగే లాక్ డౌన్ కారణంగా మూత పడుతున్న చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఇందులో సుమారు దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది మన దేశీయులు ఆర్థిక ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అన్నారు. వీరందరికి కేంద్ర ప్రభుత్వం తక్షణం సహాయానికి  ఆదుకోవడానికి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి చిరు పరిశ్రమలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాను ఈ సందర్భంగా కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి సుతారి వేణుగోపాల్,మున్సిపాలిటీ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ కస్తల శ్రవణ్ కుమార్, ముల్కలపల్లి రామగోపి,సమ్మెట సుబ్బరాజు, మేళ్ళచెర్వు ముక్కంటి, కోల మట్టయ్య, పాశం రామరాజు,యస్ కె.రజాక్, బాబా, కె.ముత్తయ్య, దొంతగాని జగన్, బిక్కన్ సాహెబ్.యస్ కె.నాజ్,  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

అర్హులైన జర్నలిస్టులకందరికీ అక్రిడిటేషన్ సౌకర్యం

Satyam NEWS

యూపీలో సరయూ నహర్ జాతీయ ప్రాజెక్టు ప్రారంభోత్సవం

Sub Editor

ఈ పుట్టినరోజు ఒక మెమరబుల్ వీకే న‌రేష్‌

Sub Editor

Leave a Comment