37.7 C
Hyderabad
May 4, 2024 14: 51 PM
Slider జాతీయం

యూపీలో సరయూ నహర్ జాతీయ ప్రాజెక్టు ప్రారంభోత్సవం

యూపీలోని బలరాంపూర్ జిల్లాలో సరయూ నహర్ జాతీయ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. 6,623 కిలోమీటర్ల పొడవైన ఈ కాలువ.. 14 లక్షల హెక్టార్లకు పైగా భూమికి సాగునీరు అందించనుంది. ఈ కాలువతో తొమ్మిది జిల్లాలకు చెందిన 29 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.

బహ్రైచ్, శ్రావస్తి, గోండా, బలరాంపూర్, సిద్ధార్థనగర్, బస్తీ, సంత్ కబీర్ నగర్, గోరఖ్‌పూర్, మహారాజ్‌గంజ్ జిల్లాలు లబ్ధి పొందనున్నాయి.1978లో ప్రాజెక్ట్ పనులు ప్రారంభమైనప్పటికీ, బడ్జెట్, తగిన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఆలస్యమైందని, నాలుగు దశాబ్దాలు దాటినా పూర్తి కాలేదని పీఎంఓ పేర్కొంది.

ప్రధాని మోదీ ప్రభుత్వం తర్వాత వచ్చిన ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వేగవంతమైందని చెప్పింది. ఈ ప్రాజెక్టు మొత్తం రూ. 9,800 కోట్ల వ్యయంతో చేపట్టగా గత నాలుగేళ్లలో రూ. 4,600 కోట్లకు పైగా నిధులు కేటాయించామని చెప్పింది.

Related posts

టీడీపీ అనాలోచిత విధానాల వల్లే ఇబ్బంది పడ్డ ఇమామ్ లు

Satyam NEWS

రాష్ట్ర ప్రభుత్వం కాజేసిన పంచాయితీ నిధులు తిరిగి ఇవ్వాలి

Satyam NEWS

ఇంతకీ యశోద హాస్పిటల్ లో ఏం జరిగింది?

Satyam NEWS

Leave a Comment