కేశవరెడ్డి విద్యాసంస్థల చైర్మన్ మధుసూదన్ రెడ్డి కడప లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలలు అవుతున్నా విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పిన విధంగా ఒక్క రూపాయి చెల్లించలేదని, గత జనవరి 7న చైర్మన్ గా తాను ప్రకటన చేసిన తర్వాత అభాండాలు వేయడానికి ఆదినారాయణ రెడ్డి అప్పుడు తప్పుడు ప్రకటన చేశారని ఆరోపించారు.
రాజకీయ డ్రామాల్లో భాగంగా 1500 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారని, ఈ రెండు నెలల్లో నిందితుడు కేశవరెడ్డి బెయిల్ పై బయటకు వచ్చారని, అతనికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అండదండలు ఉన్నాయన్నారు. తనను ఏమి చేయ లేరని ఆదినారాయణ రెడ్డి బెదిరిస్తున్నారన్నారు.
బాండ్లు రెన్యూవల్ చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. ఆదినారాయణ రెడ్డి ని రాజకీయ కోణంలో చూడవద్దని, అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఆదినారాయణ రెడ్డి అందరిని తన రాజకీయాలను వాడుకుని పేదల తల్లిదండ్రులను నిలువునా ముంచారని ఆరోపించారు.
ఊసరవెల్లి మాదిరి ఆదినారాయణ రెడ్డి మాటలు మారుస్తూ ఉంటారని,అధికారాన్ని అడ్డు పెట్టుకుని పెద్ద ఎత్తున అవినీతి కి పాల్పడ్డారని ఆరోపించారు. దేశ భక్తి ఎక్కువ ఉండి బీజేపీ లో చేరాను అన్న ఆదినారాయణ రెడ్డి పేదలను మోసం చేయడమేనా అతని పని ప్రశ్నించారు.
ఆదినారాయణ రెడ్డి మాటలను నమ్మి బీజేపీ నేతలు మోసపోవద్దని, కిషన్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి మాటలు నమ్మి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ప్రజలు కేశవరెడ్డి విద్యాసంస్థలకు ప్రజలు ఇచ్చిన అప్పులను బీజేపీ అగ్రనేతలు ఇప్పించగలరా అని ప్రశ్నించారు.
ఆదినారాయణ రెడ్డి వ్యక్తిగత స్వార్థం కోసం ప్రజలను నాశనము చేస్తారా అని ప్రశ్నించారు. ఆది ప్రజలకు డబ్బులు కట్టే వరకు తాను పోరాడుతూనే ఉంటానని, పేద ప్రజలకు న్యాయం చేసేందుకు బీజేపీ నేతలు కూడా పోరాడాలని పిలుపునిచ్చారు.