కడుపు నొప్పంటూ పిలిచి భర్తను ప్రియుడితో కలిసి హతమార్చి ఆ పై యాక్సిడెంట్ గా చిత్రీకరించాలకున్న ఘటన ఒకటి రాజన్న సిరిసిల్ల లో చోటుచేసుకోగా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆ భార్యను ఆమెకు సహకరించిన ప్రియున్నీ అతనికి సహకరించిన మరి కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామ శివారులో శుక్రవారం అర్ధరాత్రి తిరుపతి అనే యువకుడి దారుణ హత్య కేసులో కొత్తకోణాలు వెలుగుచూస్తున్నాయి.
పథకం ప్రకారమే మృతుడి భార్య మమత ఆమె ప్రియుడు సురేశ్‌తో తిరుపతిని హత్య చేయించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిపినట్లు సమాచారం. ఇల్లంతకుంట మండలం రామోజీపేటకు చెందిన తిరుపతి బద్దెనపల్లిలో టెంట్‌హౌజ్ నిర్వహిస్తున్నాడు. తిరుపతి వద్ద పని చేస్తున్న సురేశ్ తిరుపతి భార్య మమతతో అక్రమసంబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.
ఈ విషయం తిరుపతికి తెలిసి పద్ధతి మార్చుకోవాలని మందలించడంతో అడ్డుగా ఉన్న భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు సురేశ్‌తో కలిసి మమత పథకం రచించింది.ప్లాన్ ప్రకారం తిరుపతిని హతమార్చేందుకు సురేశ్ రూ.40 వేలకు నలుగురు వ్యక్తులతో సుపారి కుదుర్చుకున్నాడు. మమత తనకు కడుపునొప్పి వచ్చిందని సిరిసిల్ల లో పనిచేస్తున్న భర్త కు ఫోన్ చేయగా బాధపడుతున్న భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లాలని బాధతో వచ్చిన తిరుపతి ఆమెను వైద్యం కోసం అర్ధరాత్రి బస్వాపూర్‌కు తీసుకెళ్లాడు .
అప్పటికే గ్రామశివారులో మాటువేసిన సురేశ్ అతడి స్నేహితులు కారుతో అటకాయించి కత్తులు, గొడ్డళ్లతో దాడిచేసి విచక్షణారహితంగా పొడిచి తిరుపతిని హత్యచేశారు. ఇక చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత కారులో అక్కడి నుంచి పరారయ్యారు.హత్యపై పోలిసుల ప్రశ్నలకు ఒకదాని కొకటి పోంత్తన లేని సమాధానమిస్తూ తనకు ఏమి తెలియదని తమ వాహనం ను వెనక నుండి ఎదో డీ కొట్టడం తో తానూ స్పృహ కోల్పోయానని తెలుపుతూ హత్యను ప్రమాదంగా మార్చేందుకు మమత శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ నిజం బయటకు వచ్చింది.
హత్యకేసును చేధించడంలో పోలీసులు చురుగ్గా వ్యవహరించారు. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు విచారించిన పోలీసులు నేడో రేపో హంతకులను మీడియా ఎదుట ప్రవేశపెట్టేనున్నట్లు పోలీసులు తెలిపారు.