38.2 C
Hyderabad
May 5, 2024 22: 28 PM
Slider మహబూబ్ నగర్

శివోహం: సోమశిలలో మార్మోగిన శివనామ స్మరణ

somasila

లలితా సోమేశ్వరాలయంలో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అనుచరులు కొల్లాపూర్ మున్సిపల్ 16వ వార్డు కౌన్సిలర్ నరసింహారావు, మేకల నాగరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా కొల్లాపూర్ మండల పరిధిలోని సోమశిల గ్రామం కిటకిటలాడింది.

లలిత సోమేశ్వర ఆలయం భక్తులతో నిండిపోయింది. ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి కుటుంబ సభ్యులతో లలిత సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక  పూజలు చేశారు. ఆలయ  కమిటీ సభ్యులు  ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి, మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, ధూరెడ్డి రఘు వర్ధన్ రెడ్డి, మార్కెట్ ఛైర్మెన్ నరేందర్ రెడ్డి, చంద్రశేఖర చారిలను  శాలువాలతో  సత్కరించారు.

అదేవిధంగా ఆర్యవైశ్య సంఘ నాయకులు, కొల్లాపూర్ గ్రీన్ ల్యాండ్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం వెంకటేశ్వర్లు భక్తులకు,ప్రజలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తిశ్రద్ధలతో లలితా సోమేశ్వరాలయంలో  పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

భక్తులు అంతకుముందు కృష్ణా నదిలో స్నానాలు చేసి శివలింగ  విగ్రహాలను తయారుచేశారు. కొబ్బరికాయలు కొట్టి  సూర్య నమస్కారాలు చేశారు. అనంతరం లలిత సోమేశ్వర ఆలయం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయులు కౌన్సిలర్స్  నరసింహారావు, నయిం, మాజీ సర్పంచ్ మేకల నాగరాజు, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ ఎక్బాల్ స్వామిని దర్శించుకున్నారు.

ఇంకా మేకల కిషోర్ యాదవ్, బోరెల్లి మహేష్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు సుధాకర్ సింగ్, పశుల వెంకటేష్, బలస్వరూప్, శ్రీకాంత్, రామకృష్ణ, శ్రీను, కునాల్ భక్తిశ్రద్ధలతో లలిత సోమేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో అర్చకుల  వేద మంత్రాలతో పూజలు నిర్వహించారు.

అదేవిధంగా కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ సిఐ బి.వెంకట్ రెడ్డి, ఎస్ఐ కొంపల్లి మురళి గౌడ్ భద్రత ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కొల్లాపూర్ ఆర్టీసీ డిపో వారు భక్తుల రాకపోకలకు ఏలాంటి సమస్యలు వాటిల్లకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. మొత్తంమీద సోమశిల గ్రామం శివనామస్మరణతో మార్మోగింది. సోమశిల గ్రామం లో ప్రజలు శివరాత్రి పండుగను ఘనంగా జరుపుకున్నారు. మహా శివరాత్రి పండుగను  సోమశిల గ్రామ ప్రజలు  ఏడాదికి ఒకసారి పెద్ద పండుగలా జరుపుకుంటారు. ఒక్క పొద్దులతో జాగారం వుండే ఇతర గ్రామలనుండి వచిన్న భక్తులకు ఆలయ ఆవరణలో  కమిటీ సభ్యులు ప్రత్యేక  ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా భక్తులు సోమశిల కృష్ణా నదిలో బోటింగ్ చేస్తూ ఆహ్లాదంగా గడిపారు.

Related posts

దివిసీమ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించిన నిమ్మగడ్డ

Satyam NEWS

సత్తెమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరికీ అందాలి

Murali Krishna

పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ’ఎవోల్’ (EVOL)

Bhavani

Leave a Comment