29.7 C
Hyderabad
May 3, 2024 04: 27 AM
Slider నిజామాబాద్

వర్కింగ్ స్పీకర్: నిజాంసాగర్ నీటిని జాగ్రత్తగా వాడాలె

pocharam srinivasreddy

నిజాంసాగర్ ప్రాజెక్టులో ఉన్న కొద్దిపాటి నీటిని సక్రమంగా వినియోగించుకోవడంతో పాటుగా కాలువల చివరి ప్రాంతంలోని భూములకు కూడా నీరు అందించేందుకు శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి స్వయంగా నడుం బిగించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టులో ప్రస్తుత యాసంగిలో సాగు చేసిన పంటలను ఆదుకోవడానికి  ప్రాజెక్టులో ఉన్న కొద్దిపాటి నీటిని రెండు తడులుగా అందించాలని స్పీకర్ ప్రభుత్వాన్ని కోరగా,  మొదటి తడి నీటిని నిన్నటి నుండి విడుదల చేసిన విషయం తెలిసిందే.

స్పీకర్ ఆదేశాలకు అనుగుణంగా సాగునీటి శాఖ అధికారులు నిన్నటి నుండి 1200 క్యూసెక్కుల నీటిని కాలువకు విడుదల చేస్తున్నారు. అయితే, నీటి సక్రమ వినియోగంతో పాటు అన్ని డిస్ట్రిబ్యూటర్ల పరిధిలోని పొలాలకు నీరు చేరుతున్నాయో లేదో పరిశీలించడానికి స్పీకర్ పోచారం ఈ రోజు క్షేత్ర స్థాయిలో పర్యటించారు.

స్వయంగా జీప్ నడుపుతూ బాన్సువాడ మండలం జేకె తండా వద్ద నుండి నిజాంసాగర్ ప్రధాన కాలువ కట్టపై బాన్సువాడ, నసరుల్లాబాద్, బీర్కూర్, వర్ని, కోటగిరి, చందూర్ మండలాల పరిధిలో పర్యటించారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటరాగా ప్రతి డిస్ర్టిబ్యూటరీ  వద్ద ఆగి అక్కడి రైతులతో మాట్లాడారు.

ఉప కాలువలకు సక్రమంగా నీళ్లు వస్తున్నాయా అంటూ వాకబు చేశారు. అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేస్తూ, తగిన సూచనలు చేశారు. అన్ని బ్రాంచి కాలువలకు సరిపోయేంతగా  నీళ్ళ ప్రవహించాలని అధికారులకు సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులు తమ గ్రామాల పరిధిలోని అన్ని పొలాలకు నీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని, అధికారులతో కలిసి సమన్వయం చేసుకోవాలని సూచించారు.  ఎట్టి పరిస్థితుల్లోనూ ఎకరా పొలం కూడా ఎండిపోనివ్వమని రైతులకు హామీ ఇచ్చారు. రైతులు కూడా నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు.

Related posts

సినీ నటుడు రాజీవ్ కనకాల సోదరి మృతి

Satyam NEWS

రోడ్ ప్రమాదాల నియంత్రణ కు చర్యలు చేపట్టండి

Satyam NEWS

అవనికి చైతన్యం అమ్మ

Satyam NEWS

Leave a Comment