39.2 C
Hyderabad
May 4, 2024 20: 17 PM
Slider ప్రత్యేకం

ఎస్ఎల్‌జీ ఆసుప‌త్రితో మ‌హేశ్వ‌ర మెడిక‌ల్ కాలేజి ఒప్పందం

#slghospitals

850 ప‌డ‌క‌లు క‌లిగిన మ‌ల్టీస్పెషాలిటీ టెర్షియ‌రీ కేర్ టీచింగ్ ఆసుప‌త్రి మ‌హేశ్వ‌ర మెడిక‌ల్ కాలేజి. ఇందులో మొత్తం 21 ప్ర‌త్యేక విభాగాలు, ప్ర‌పంచ‌స్థాయి మౌలిక స‌దుపాయాలు, నిబ‌ద్ధ‌త క‌లిగిన వైద్య‌సిబ్బంది, సెంట్ర‌ల్ క్యాజువాలిటీలో 24 గంట‌ల ఎమ‌ర్జెన్సీ ఆరోగ్య సేవ‌లు, ఓబీజీ క్యాజువాలిటీ, ట్రామా కేర్ సెంట‌ర్, ఐసీయూ, ఐసీసీయూ, ఎస్ఐసీయూ, ఎన్ఐసీయూ, పీఐసీయూ, ల్యాబొరేట‌రీ, అత్యాధునిక బ్ల‌డ్ బ్యాంకు, ఫార్మ‌సీ, అంబులెన్సు సేలు ఉన్నాయి.

కాలేజి ప్రాంగ‌ణం చుట్టుప‌క్క‌ల 36 గ్రామాల్లోని నిరుపేద వ‌ర్గాల‌కు మ‌హేశ్వ‌ర మెడిక‌ల్ కాలేజి, ఆసుప‌త్రి ఉచితంగా వైద్య‌సేవ‌లు అందిస్తోంది. ఓబీజీ, ఆర్థో, పీడియాట్రిక్ విభాగాల‌కు చెందిన వైద్యులు త‌ర‌చు ఈ గ్రామాల‌ను సంద‌ర్శించి, వివిధ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌ల‌కు త‌ర‌చు వైద్య‌ప‌రీక్ష‌లు చేస్తున్నారు.

ప్ర‌ముఖ దాత‌, వాణిజ్య‌వేత్త దండు శివ‌రామ‌రాజు, ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు క‌లిసి దూర‌దృష్టి క‌లిగిన డీవీఎస్ సోమ‌రాజు నేతృత్వంలో 999 ప‌డ‌క‌ల‌తో మ‌ల్టీ స్పెషాలిటీ టెర్షియ‌రీ  క్వాటెన‌రీ కేర్ ఆసుప‌త్రిగా బాచుప‌ల్లి నిజాంపేట రోడ్డులో ఉన్న లక్ష్మీ గాయ‌త్రి ఆసుప‌త్రి ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఎల్‌జీ ఆసుప‌త్రి)ని ఏర్పాటుచేశారు.

త‌మ క‌ళాశాల‌లోని హౌస్ స‌ర్జ‌న్లు, పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థుల‌కు విస్తృత‌మైన అనుభ‌వాన్ని, కార్పొరేట్ శిక్ష‌ణ‌ను అందించే ఉద్దేశంతో తాము శ్రీ లక్ష్మీ గాయ‌త్రి ఆసుప‌త్రి ప్రైవేట్ లిమిటెడ్‌తో భాగ‌స్వామ్యం వ‌హిస్తున్న‌ట్లు మ‌హేశ్వ‌ర మెడిక‌ల్ కాలేజి మ‌రియు ఆసుప‌త్రి వైస్ ఛైర్మ‌న్ కీర్తి మ‌హేష్ తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులు ప్రాథ‌మికంగా టీచింగ్ ఆసుప‌త్రికి, కార్పొరేట్ ఆసుప‌త్రికి మ‌ధ్య తేడాలు తెలుసుకుంటార‌ని, త‌ర్వాత ఎస్ఎల్‌జీ ఆసుప‌త్రి ప్రాంగ‌ణంలో రోగుల‌కు చికిత్స అందించ‌డంలో అనుభ‌వం పొందుతార‌ని ఆమె చెప్పారు. వైద్య‌రంగంలోకి కొత్త‌గా వ‌స్తున్న‌వారికి అవ‌గాహ‌న క‌ల్పించ‌డం, వివిధ ప్రాంతాల‌కు చెందిన ప‌లు ర‌కాల రోగులు ఆసుప‌త్రికి అనేక వ్యాధుల‌తో వ‌చ్చిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడే నిర్ణ‌యం తీసుకోవ‌డం, వైద్య‌వృత్తిలో వివిధ ప‌ద్ధ‌తుల‌లో ఉండే చికిత్సా విధానాల‌పై వారు దృష్టి కేంద్రీక‌రించేలా చేయ‌డమే ఈ శిక్ష‌ణ కార్య‌క్ర‌మం ఉద్దేశం. ఆసుప‌త్రిలో చేరిన‌ప్పుడు రోగులు, వారి కుటుంబ‌స‌భ్యుల ఉద్దేశాలేంటో తెలుసుకుని, వారికి అనువైన చికిత్స విధానాల‌ను అందించ‌గ‌లిగేలా జూనియ‌ర్ వైద్యుల‌కు శిక్ష‌ణ కూడా ఇందులో ల‌భిస్తుంది.

ప‌డ‌క‌లు, వైద్య‌సేవ‌ల‌కు సంబంధించి హైద‌రాబాద్ న‌గ‌రంలోని అతిపెద్ద ఆసుప‌త్రుల‌లో శ్రీ లక్ష్మీగాయ‌త్రీ ఆసుప‌త్రి ఒక‌టి. ఇది కేవ‌లం పెద్ద ఆసుప‌త్రి మాత్ర‌మే కాదు ఇక్క‌డ రోగుల సంఖ్య‌, న‌గ‌రంలోనే అత్యాధునిక వైద్య స‌దుపాయాలు కూడా ఎక్కువే. న‌గ‌రంతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద ఆసుప‌త్రుల‌లో ఒక‌టిగా ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు మ‌రింత నాణ్య‌మైన వైద్య‌సేవ‌లు అందుబాటులో ఉంచాల‌న్న‌దే మా ధ్యేయం. ఈ ప్రాంత‌వాసులు ఆధునిక‌, నాణ్య‌మైన చికిత్స‌ల కోసం దూర‌ప్రాంతాల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం రాకూడ‌దు” అని ఎస్ఎల్‌జీ ఆసుప‌త్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ డీవీఎస్ సోమ‌రాజు చెప్పారు. అత్యాధునిక ప‌రిజ్ఞానం, చికిత్సా విధానాల్లో ఆధునిక వ్య‌వ‌స్థ‌లతో ప్ర‌జ‌ల‌కు అత్యున్న‌త నాణ్య‌త‌తో కూడిన వైద్య‌సేవ‌లు అందిస్తున్నామ‌ని సోమ‌రాజు వివ‌రించారు. ఎప్ప‌టిక‌ప్పుడు రోగులు, వారి కుటుంబ‌స‌భ్యుల నుంచి వివ‌రాలు తెలుసుకుని, ఆసుప‌త్రిలో రోజువారీ కార్య‌క‌లాపాల‌ను మెరుగుప‌రుచుకుంటున్నామ‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ లక్ష్మీగాయ‌త్రీ ఆసుప‌త్రి మెడిక‌ల్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ప్ర‌దీప్ కుమార్ పాణిగ్రాహి, డిప్యూటీ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ర స‌వితా సుఖ్‌దేవ్‌, మ‌హేశ్వ‌ర మెడిక‌ల్ కాలేజ్ మ‌రియు ఆసుప‌త్రి ప్రోగ్రాం కోఆర్డినేట‌ర్ డాక్ట‌ర్ న‌మ్ర‌త త‌దిత‌రులు పాల్గొన్నారు. ఇదే త‌ర‌హా శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల‌ను న‌గ‌రంలోని వివిధ కార్పొరేట్ ఆసుప‌త్ర‌ల‌తో త‌మ విద్యార్థులు, హౌస్ స‌ర్జ‌న్ల‌కు చేస్తున్న‌ట్లు ఆమె తెలిపారు.

Related posts

సుప్రీంకోర్టుకు వెళుతున్న డోనాల్డ్ ట్రంప్

Satyam NEWS

జిల్లా స్థాయి ఖోఖోలో ఐగ్రో విద్యార్ధుల ప్రతిభ

Satyam NEWS

నరసరావుపేట లో పర్యటించిన సినీ నటుడు శివాజీ

Satyam NEWS

Leave a Comment