40.2 C
Hyderabad
April 28, 2024 15: 35 PM
Slider ప్రపంచం

సుప్రీంకోర్టుకు వెళుతున్న డోనాల్డ్ ట్రంప్

#DonaldTrump

ఇంకా లక్షలాది ఓట్లు లెక్కించాల్సి ఉండగానే సుప్రీంకోర్టుకు వెళుతున్నట్లు అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

జో బైడెన్ తో హోరా హోరీగా తలపడుతున్న ట్రంప్ తీవ్ర స్థాయిలో పలుమార్లు అసహనం వ్యక్తం చేశారు. చేస్తూనే ఉన్నారు.

తాజాగా ఫాక్స్ న్యూస్ ప్రిడిక్షన్ ప్రకారం జోబైడెన్ కు పాపులర్ ఓటు 50 శాతం, డోనాల్డ్ ట్రంప్ కు పాపులర్ ఓటు 48.4శాతం వచ్చే అవకాశం ఉంది.

అదే విధంగా జో బైడెన్ కు ఎలక్ట్రోరల్ ఓటు 238, ట్రంప్ కు 213 గా ఉంది. ఈ అంచనాలతో ట్రంప్ తీవ్ర ఆగ్రహోదగ్రుడవుతున్నారు. ఫాక్స్ న్యూస్ తొలి నుంచి ట్రంప్ కు అనుకూల వార్తలను మాత్రమే ఇచ్చేది.

ఈ ఎన్నికలు బోగస్ అని ట్రంప్ అన్నారు. పలు ప్రాంతాలలో తానే గెలిచినా ఇదేం లెక్క అంటూ ఆయన చిరాకు పడుతున్నారు.

పెసెల్వేనియా, మిషిగాన్ లలో ఓట్ల లెక్కింపు మందకొడిగా సాగుతున్నది. అక్కడ కూడా జో బైడెన్ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Related posts

పుణ్యధాత్రి

Satyam NEWS

భార్య అనుష్కతో సరదా షికార్లు చేస్తున్న విరాట్ కోహ్లీ

Satyam NEWS

ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగిన ముడుంబై దామోదరాచార్యులు

Satyam NEWS

Leave a Comment