34.7 C
Hyderabad
May 5, 2024 02: 16 AM
Slider ముఖ్యంశాలు

మహిళా కమిషన్ లేకపోవడం దురదృష్టకరం

#KatragaddaPrasuna

తెలంగాణలో మహిళల సమస్యల పరిష్కారానికి మహిళా కమిషన్ చైర్మన్ లేకపోవడం తెలంగాణ ఆడపడుచుల దౌర్భాగ్యమని సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన అన్నారు.

రెండేళ్లుగా చైర్మన్ ని నియమించకుండా టీఆర్ ఎస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆమె మండిపడ్డారు. ఈ ప్రభుత్వం కనీసం చట్టసభల్లో మహిళలకు సరైన సముచిత స్థానం ఇవ్వకుండా మహిళా సంక్షేమ, భద్రత భరోసా పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దురదృష్టకరమైన విషయమని తెలిపారు.

పోరాడి తెచ్చుకున్న తెలంగాణ లో మహిళలకు రక్షణ కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఒక మహిళ గా తల్లిగా, కూతురు గా విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.

కేంద్రం నిర్భయ చట్టం తెచ్చినా, ఏపీలో దిశ చట్టం వచ్చినా, తెలంగాణ లో షీ టీమ్ లు ఉన్నప్పటికీ కామాంధుల్లో ఎలాంటి మార్పులు రావటం లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని చట్టాలు వచ్చినా  మహిళలను రక్షించేవారు కరువయ్యారు.

దేశంలోనే తెలంగాణ 3 స్టానానికి రావడం విస్మయానికి గురి చేస్తోంది. తెలంగాణలో హత్యా చారాలు, మహిళలపై యాసీడ్ దాడులు, పరువు హత్యలు, సైబర్ క్రైం దాడులతో పాటు, పైశాసిక దాడులు నిత్య కృత్యంగా మారాయి అని ఆమె అన్నారు.

Related posts

కాకినాడ ప్రెస్ క్లబ్లో జర్నలిస్టు మిత్రుల ఆత్మీయ కలయిక

Bhavani

తొలి కేసును చేధించిన సైబ‌ర్ క్రైమ్ పోలీసులు…!

Satyam NEWS

వెల్కమ్:ట్రంప్ రాక మాకెంతో ప్రత్యేకం సుమండీ

Satyam NEWS

Leave a Comment