30.7 C
Hyderabad
May 5, 2024 04: 59 AM
Slider మహబూబ్ నగర్

మాలలను సంఘటితం చేసి పోరాటం చేయాలి: మంత్రి నర్సింహయ్య

#malamahanadu

తెలంగాణ మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశం మహబూబ్ నగర్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గుంత లక్ష్మయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నర్సింహయ్య పలువురికి సంఘంలో బాధ్యతలు అప్పగించారు.

మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శిగా గోకమాల అంజయ్య,  జిల్లా ప్రచార కార్యదర్శిగా ధర్పల్లి అంజనేయులు, మహబూబ్ నగర్ నియోజకవర్గం ఉపాధ్యక్షులుగా సాతర్ల పెంటయ్య, మహబూబ్నగర్ రూరల్ మండల ప్రధాన కార్యదర్శి గా మంత్రి పవన్, మహబూబ్ నగర్ రూరల్ మండల ఉపాధ్యక్షులుగా మంత్రి బాలరాజు ను  నియమించి వారికి నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాలలు సంఘటితం చేసి పోరాటం చేయాలన్నారు. గ్రామ గ్రామానా తెలంగాణ మాల మహానాడు కమిటీలను వేసి సంఘం  బలోపేతం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. మాలలు అన్ని రంగాల్లో వెనుకబాటు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.  మాలల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ మాల మహానాడు శ్రేణులు పనిచేయాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గ్రామంలో మాలలకు చేరే విధంగా కృషి చేయాలన్నారు.

భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, జాతీయ న్యాయ శాఖ, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎస్సీ వర్గీకరణ చెల్లదు అని తేల్చి చెప్పినప్పటికి కూడా స్వార్థ ప్రయోజనాల కోసం అగ్రవర్ణ రాజకీయ పార్టీలు అన్నదమ్ముల్లాంటి మాల మాదిగలను విడదీసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మాల మాదిగలను విడదీసేందుకు చేసే కుట్రలను తిప్పికొట్టాలని పేర్కొన్నారు.

ఎక్కడ మాలలకు అన్యాయం జరిగినా వారికి అండగా నిలిచి వారి పక్షాన న్యాయ పోరాటం చేయాలన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి వాడలో భారత రాజ్యాంగ నిర్మాత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా, స్వర్గీయ పీవీ ఆలోచనా విధానంతో పని చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ ఎనుపోతుల కర్ణ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు మంత్రి చెన్నకేశవులు, జిల్లా అధ్యక్షులు గుంత లక్ష్మయ్య, జిల్లా కార్యదర్శి కాడం రాఘవేందర్,జిల్లా ఉపాధ్యక్షులు పాలమూరి రాము, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు అజిత్ కుమార్, మహబూబ్నగర్ నియోజకవర్గం అధ్యక్షులు తోళ్ల మాసయ్య, పట్టణ అధ్యక్షులు సాతర్ల శివకుమార్, మహబూబ్నగర్ రూరల్ మండల అధ్యక్షులు నరేష్,హన్వాడ మండల ఉపాధ్యక్షులు పత్తి మునయ్య, పట్టణ యువత అధ్యక్షులు కంచిమి నర్సింహులు, మా ఉన్న రూరల్ మండల యువత అధ్యక్షులు తిరుపతయ్య,మరియు తోళ్ల పవన్ తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

తొలి ఆటబొమ్మ అమ్మ

Satyam NEWS

జమ్మి చెట్టు విజయానికి ప్రతీక : ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Satyam NEWS

సీజేఐ కి స్వాగతం పలికిన నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్

Satyam NEWS

Leave a Comment