28.7 C
Hyderabad
April 28, 2024 09: 54 AM
Slider హైదరాబాద్

కరోనా ఎలర్ట్: సమిష్టి కృషితో కరోనాను తరిమికొడదాం

medchal collector

ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న, సమిష్టి కృషితో కరోనా వైరస్ ను తరిమి కొడదామని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పిలుపు నిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ మత పెద్దలు, జిల్లా అధికారులు, పోలీసు అధికారులతో కరోనా వైరస్ ను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా వైరస్ జన సమూహంలో ఉండటం వల్ల తొందరగా వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉన్నందున హిందువులు, ముస్లింలు, క్రైస్తవ, సిక్కు మతస్థులు తమ తమ పండుగలను, నమాజ్ లు, ప్రార్థనలు పరిమిత స్థాయిలో జరుపుకోవాలని, వీలైనంత వరకు తమ ఇంట్లో నుండి పూజలు, ప్రార్థనలు, నమాజ్ లు చేసుకోవాలని సూచించారు.

ఉగాది పండుగ ఉన్నందున పంచాంగ శ్రవణం కార్యక్రమాలకు కుటుంబాలు పరిమితి స్థాయిలో జరుపుకుని పంచాంగ శ్రవణాన్ని సోషల్ మాధ్యమాలు, టీవీల ద్వారా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ముస్లింలు శుక్రవారం, క్రైస్తవులు ఆదివారం, ప్రత్యేకమైన రోజుల్లో ప్రార్థనలు నమాజ్ లు సాధ్యమైనంత వరకు పరిమితి స్థాయి మందితో జరుపుకోవాలని సూచించారు.

ప్రతి పవిత్ర హృదయంతో చేసే ప్రార్థనను భగవంతుడు పలకరిస్తాడని దానికి ప్రార్థనా మందిరానికి వెళ్లాల్సిన అవసరం లేదని తోటి వారికి చేసే సేవ భగవంతునికి ఇష్టమైనదని చెప్పారు. ప్రజాశ్రేయస్సు ఆరోగ్యం సురక్ష దృశ్య దీనిని అందరూ పాటించాలని కోరారు. హాజరైన వివిధ మత పెద్దలు ప్రభుత్వం తీరుకు సంతృప్తి వ్యక్తం చేసి పూర్తిగా సహకరిస్తామని తెలిపారు.

ఈ ఈ నెల 31వ తేదీ వరకు పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్న వారు 200 మంది అతిథులతో పెళ్ళి జరుపుకోవాలన్నారు. ఏప్రిల్ 1 నుంచి అన్ని ఫంక్షన్ హాల్స్ బుకింగ్ ఇవ్వకూడదని ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశం  లో కరోనా వైరస్ ను అరికట్టేందుకు చేసిన సూచనలను పాటించి వైరస్ ను తరిమేయాలన్నారు.

వైరస్ సోకి బాధపడే కంటే రాకుండా ముందు స్వీయ జాగ్రత్తలు పాటించి ఆరోగ్యంగా ఉండాలన్నారు. తహశీల్దార్లు, ఎంపిడివోలు తమ క్రిందిస్థాయి అధికారులతో గ్రామాల్లో, పట్టణాల్లో తమ చుట్టు ప్రక్కల విదేశాల నుంచి వచ్చిన వారి సమాచారం తీసుకుని జిల్లా వైద్య అధికారికి తెలియజేయాలన్నారు.

అధికారులందరూ కరోనా వైరస్ విషయంలో అలసత్వం, అశ్రద్ధ వహించకుండా పనిచేసి నిర్మూలించా ల లని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత గ్రామ, పట్టణ పరిశుభ్రత విషయంలో తగిన శ్రద్ధ వహించాలని ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప సమావేశాలు పెట్టకూడదని, వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించుకోవాలని ఆదేశించారు.

కరోనా పరీక్షల కొరకు జిల్లాలోని ఘట్కేసర్ ఏరియా ఆసుపత్రిలో 5 పడకలు, మేడ్చల్  ఆసుపత్రిలో 5 పడకలు మల్కాజ్ గిరి ఆసుపత్రిలో 8 పడకల సౌకర్యాన్ని కల్పించినట్లుగా తెలిపారు. మార్చి 1వ తేదీకి ముందుగా విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి తక్షణమే పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.

కలెక్టరు కార్యాలయానికి సమాచారం అందించేందుకు నెంబర్ 9492409781 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్, వైద్య సిబ్బంది అప్రమత్తంగా అందుబాటులో ఉండి పరస్పర సమన్వయంతో ముందుకెళ్లాలని ఆదేశించారు.

ఎలాంటి పుకార్లు నమ్మవద్దని తప్పుడు వార్తలు వ్యాపింపజేసే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. కరోనా వైరస్ ను నిరోధించడంలో అందరూ సహకరించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ విద్యాసాగర్, జాన్ శాంసన్, డీఆర్డీవో మధుకర్ రెడ్డి, ఆర్డీవోలు రవి, మల్లయ్య, కుషాయిగూడ ఎసిపి శివకుమార్, జిల్లా అధికారులు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడివోలు, హిందూ, ముస్లిం, క్రైస్తవ మొదలగు మత పెద్దలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాజ్యాంగాన్ని అవమానపరిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫిర్యాదు

Satyam NEWS

బ్లాక్ షిప్:రాజన్నహుండీ లెక్కింపులో ఉద్యోగి చేతివాటం

Satyam NEWS

ఎమ్మార్వో సమక్షంలోనే డబ్బుల కోసం తన్నుకున్న వీఆర్వోలు

Satyam NEWS

Leave a Comment