36.2 C
Hyderabad
May 12, 2024 18: 08 PM
Slider గుంటూరు

ఇంటి మార్గం మూత వృద్దాప్యంలో మాజీ పోలీస్ ఇబ్బందులు

ex police

మంగ‌ళ‌గిరి పరిధిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ కు ఆనుకుని ఉన్న గృహాల యజమానుల బాధ‌లు వర్ణనాతీతం. గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా తమ సమస్యలు తీరడం లేదు.

గతంలో ఏపీఎస్పీ బెటాలియన్ మెత్తం ఫ్రీ జోన్ గా ఉండేది. బెటాలియన్ రోడ్డు నుండే చుట్టు ప్రక్కల గృహాలకు దారి ఉండేది. కాలక్రమేణా భద్రత కారణాల పేరుతో ఏపీఎస్పీ బెటాలియన్ చుట్టూ ఇనుప ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. దీంతో చుట్టుప్రక్కల నివాసాల ప్రజలు రాక పోకలకు దారిలేక ప‌క్క ఇంటి నుంచో వెనుక ఇంటి నుంచో నడక దారి ఏర్పాటు చేసుకుని వెనక వైపు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. కొనమెరుపేమిటంటే ఇక్కడ నివాసముంటున్నవారందరూ గతంలో ఎప్పీఎస్పీ బెటాలియన్ లో ఉద్యోగాలు చేసిన పోలీసులే.

ఇంట్లో నుంచి బయటకు రాలేక పోతున్నామంటూ రిటైర్డ్ ఆర్ ఎస్ ఐ సుదర్శనరావు తన బాధ‌ను వ్యక్తం చేస్తూ 1972 నుండి 1997 వరకు ఇక్కడే తాను ఉద్యోగం చేశానని, క్యాంపున‌కు ఎదురువైపు ఉన్న 167 సర్వే నంబరులో ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తాను ఇళ్ళు నిర్మించుకున్నప్పటికీ బెటాలియన్ భద్రత పేరుతో 2003 సంవత్సరంలో తమ నివాసాల ముందు అధికారులు ఇనుప ఫెన్సింగ్ ను ఏర్పాటు చేశారని వాపోయారు. సమస్య పరిష్కారానికి బెటాలియన్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు అందరి వద్ద వెళ్ళినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదన్నారు.


గతంలో ప్రక్క ఇంటి నుండి వెనుకబజారుకు వెళ్ళి రాకపోకలు సాగించుకునే వారమని, నేడు వారుకూడా మాకు నడకదారి ఇచ్చేందుకు అంగీకరించడం లేదని తెలిపారు. వృద్ధాప్యంలో హాయిగా ఉందామని ఇక్కడ స్థలాలు కొనుగోలు చేసి, ఇళ్ళు నిర్మాణం చేసుకుంటే నేడు అదే తమకు శాపంగా మారిందని పేర్కొన్నారు. ఏదైనా అత్యవసరమై ఆసుపత్రికి వెళ్లాలన్నా అవకాశం లేదని అన్నారు. తన భార్యకు పక్షవాతం కావడంతో ఫిజియేథెరపీ వైద్యులు సైతం రాలేని పరిస్థితి నెలకొందని అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇదే పరిస్థితి ఇక్కడ ఉన్నవారందరూ అనుభవిస్తున్నారని తెలిపారు.

Related posts

Revolution at Grassroot: కొల్లాపూర్ సర్పంచ్ ల తిరుగు బాట

Satyam NEWS

‘శివాoశు’ను హీరోగా పరిచయం చేస్తూ ఆర్.వి.జీ ప్రొడక్షన్-3 ప్రారంభం

Satyam NEWS

Hats off: అవయవ దాత కు ఘన సన్మానం

Satyam NEWS

Leave a Comment