38.2 C
Hyderabad
May 5, 2024 19: 29 PM
Slider మహబూబ్ నగర్

Revolution at Grassroot: కొల్లాపూర్ సర్పంచ్ ల తిరుగు బాట

#Kollpur Mandal

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలానికి సంబంధించిన సర్పంచులు సర్వసభ్య సమావేశాన్ని వాకౌట్ చేశారు. పది నిమిషాలు కూర్చొని ఎంపీడీఓ ఆఫీస్ లో మీటింగ్ సమావేశంలో పాల్గొనకుండా కింద కూర్చొని నిరసన తెలిపారు.

సర్వసభ్య సమావేశం వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని తమ సమస్యలను పరిష్కరించాలి అని సర్పంచులు అందరూ కింద కూర్చుని నిరసన తెలిపారు.

సింగోటం గ్రామ సర్పంచ్ మాండ్ల కృష్ణయ్య, ముక్కిడి గుండం గ్రామ సర్పంచ్ దశరథం, సోమశిల గ్రామ సర్పంచ్  మద్దిలేటి యాదవ్, ఎనబెట్ల గ్రామ సర్పంచ్ పాశం నాగరాజు తదితర సర్పంచ్ లు పాల్గొన్నారు.

వారు లేవనెత్తిన అంశాలు ఇవి: 1)సర్పంచ్ పైన బాధ్యతలు ప్రభుత్వం ఎక్కువగా పెట్టింది. మిషన్ భగీరథ పైపు లీకేజీ కూడా సర్పంచుల బాధ్యత అంటూ ఒత్తిడి చేస్తున్నారు.

2)మెగా కంపెనీ వాళ్లు పట్టించుకోవడం లేదు డంపింగ్ యాడ్ చేయమని సతాయిస్తున్నారు.

3)నర్సరీ సరిగా చూడలేదని షోకాజ్ నోటీసు ఇస్తామని అధికారులు బెదిరిస్తున్నారు. వీధి లైట్లు ప్రైవేట్ వ్యక్తులకు కాంటాక్ట్ ఇస్తున్నారు.

4)గ్రామాలలో చెట్లు చనిపోతే సర్పంచులు అదే బాధ్యత అని అంటున్నారు

5)స్కూల్ పారిశుధ్యం, అంగన్వాడీ పారిశుద్ధ్యం డంపింగ్ యార్డ్ పల్లె ప్రగతి వనం ఈ పనుల తో ఇబ్బందికి గురి చేస్తున్నారు.

6) ప్రజలకు మేము జవాబు చెప్పలేకపోతున్నాం ప్రభుత్వం మా హక్కులను కాలరాస్తుంది.

Related posts

ఓట్లు అడిగే నైతిక హక్కు టీఆర్ ఎస్ పార్టీకి లేదు

Satyam NEWS

ఎమ్మెల్యే మేడా ని విమర్శిస్తే తీవ్ర పరిణామాలు

Satyam NEWS

ఈచ్ వన్ టీచ్ వన్ కు BTA సంపూర్ణ మద్దతు

Satyam NEWS

Leave a Comment