39.2 C
Hyderabad
May 4, 2024 22: 35 PM
Slider హైదరాబాద్

25వరకు పలు రైళ్లు రద్దు

#CPRO CH Rakesh

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ నెల 19(సోమవారం) నుంచి 25వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్ తెలిపారు. అలాగే, హైదరాబాద్‌ జంటనగరాల్లో ప్రజలకు సర్వీసులందించే 23 ఎంఎంటీఎస్‌ రైళ్లను సోమవారం నుంచి వచ్చే ఆదివారం వరకు రద్దు చేస్తున్నట్టు స్పష్టంచేశారు.

వివరాల ప్రకారం తెలుగు రాష్ట్రాలు సహా ఇతర ప్రాంతాలకు సర్వీసులందించే పలు రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్ తెలిపారు. అయితే, 28 రైళ్లను వారం రోజుల పాటు రద్దు చేయగా..

ఆరు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఇక, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ డివిజన్ల పరిధిలో మౌలిక వసతుల నిర్వహణకు సంబంధించిన పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా..

గుంతకల్‌-బోధన్‌ రైలు సమయంలో తాత్కాలికంగా మార్పులు చేసినట్టు తెలిపారు. దీంతో పాటు హైదరాబాద్‌ జంటనగరాల్లో 23 ఎంఎంటీఎస్‌ రైళ్లను సోమవారం నుంచి వచ్చే ఆదివారం వరకు రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. రైళ్ల రద్దను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు ప్రయాణాన్ని ప్లాన్‌ చేసుకోవాలని సూచించారు.

Related posts

బొజ్జల కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

Satyam NEWS

బాలికపై రేప్ కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష

Sub Editor

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ర‌హ‌దారుల నిర్మాణంపై సమీక్ష‌

Satyam NEWS

Leave a Comment