Slider నిజామాబాద్

మాస్టర్ ప్లాన్ లో మీ పాత్ర ఏంటి..?

#shabbir

వివరణ ఇవ్వాలని షబ్బీర్ అలీని కోరిన ఇండస్ట్రియల్ జోన్ బాధిత రైతులు

‘కామారెడ్డి మాస్టర్ ప్లాన్ లో మీ పాత్ర ఉందని అంటున్నారు. ఈ విషయంపై మీరు వివరణ ఇవ్వాలి.. మీ పాత్ర లేకపోతే మా రైతులకు అండగా నిలవాలి’ అని కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ఇండస్ట్రియల్ జోన్ లో  భూములు కోల్పోతున్న బాధిత రైతులు మాజీ మంత్రి షబ్బీర్ అలీని కోరారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండావిష్కరణ, రైతు డిక్లరేషన్ కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ పాల్గొన్నారు. షబ్బీర్ అలీ గ్రామానికి వస్తున్నారని తెలుసుకున్న బాధిత రైతులు అడ్లూర్ గ్రామానికి చేరుకుని గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద సమావేశమయ్యారు. షబ్బీర్ అలీ రైతుల వద్దకు వెళ్లి మాట్లాడారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కామారెడ్డి మున్సిపాలిటీకి చెందిన మాస్టర్ ప్లాన్ లో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్, గ్రీన్ జోన్ లలో వందలాది ఎకరాలు నష్టపోతున్నామన్నారు. తమకు తెలియకుండానే భూములు తీసుకునే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. కలెక్టర్ ఆఫీస్, బైపాస్ రోడ్డుతో ఇప్పటికే భూములు కోల్పోయామన్న రైతులు మరోసారి భూములు కోల్పోయి రోడ్డున పడలేమని తెలిపారు. ఈ ప్రాంతాన్ని మరో నల్గొండ చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. పార్టీలకు అతీతంగా తమకు న్యాయం చేయాలన్నారు.

ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తో మాట్లాడి సమస్య చెప్పుకుందామని వెళ్తే సమయం ఇవ్వడం లేదని, మొన్న ధర్నా చేస్తున్న చోట ఉన్నారని వెళ్లి సమస్య పరిష్కరించాలని కోరుతూ ప్లకార్డులు పట్టుకున్న పాపానికి పోలీసులతో అరెస్ట్ చేయించారని వాపోయారు. తమపై వాళ్ళ పార్టీ నాయకులు దాడి చేశారన్నారు. ఏ నాయకులైనా రైతులకు అండగా నిలవాలని, లేకపోతే పాతాళంలో తొక్కేస్తామని హెచ్చరించారు. గంప గోవర్ధన్… మొన్నటి ఎన్నికల్లో తక్కువ ఓట్లతో గట్టెక్కినవ్.. ఇప్పుడు నిన్ను ఓడించి తీరుతామని రైతులు స్పష్టం చేశారు.

మీకు సమాచారం లేకుండా మీ ఇంటిన్క్ కూల్చేస్తే ఊరుకుంటావా అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. షబ్బీర్ అలీ గారు.. ఇందులో మీ పాత్ర కూడా ఉందంటున్నారు. మీ పాత్రపై ఇప్పుడే వివరణ ఇవ్వాలి. మీ పాత్ర లేకపోతే మా రైతులు చేస్తున్న ఉద్యమానికి అండగా నిలవాలని కోరారు. ఇంకా ఒక్క ఏడాది మాత్రమే సమయం ఉందని, రైతులకు అండగా లేకపోతే రోడ్డుపైకి తెస్తామని, ఇక జీవితంలో రోడ్డుపైనే ఉండాలన్నారు. రైతులు తలుచుకుంటే కేంద్ర ప్రభుత్వమే నల్ల చట్టాలను రద్దు చేసిందని, మీరెంత అన్నారు.

Related posts

అదిగదిగో ప్లానెట్‌ 9.. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా

Sub Editor

జర్నలిస్టుల పిల్లలకు పాఠశాల   ఫీజులో రాయితీ కల్పించాలి

Satyam NEWS

కర్ఫ్యూ సమయం…రోడ్లన్నీ ఖాకీ వనం..!ఎక్కడంటే…?

Satyam NEWS

Leave a Comment