36.2 C
Hyderabad
May 7, 2024 12: 27 PM
Slider నల్గొండ

రక్తదానంతో మరొకరికి ప్రాణం పోద్దాం

#Jana Chaitanya Trust

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రయివేట్ హాస్పటల్ లో నిండు గర్భిణీ మహిళకు ‘ఓ’ పాజిటివ్ రక్తం అత్యవసరమని నాగరాజు జనచైతన్య ట్రస్ట్ సభ్యులు పి.వంశీ, పారా.సాయి,శివశంకర్ లకు సమాచారం అదివ్వడంతో తక్షణమే స్పందించిన జనచైతన్య ట్రస్ట్ అధ్యక్షుడు పారా సాయి ‘ఓ’ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ డోనర్ శీలం నవీన్ తో సంప్రదించి,కోదాడ పట్టణంలోని తిరుమల బ్లడ్ బ్యాంకు వద్ద రక్తదానం చేయించి సకాలంలో గర్భిణీ స్త్రీకి రక్తం అందించారు.

ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు పారా సాయి మాట్లాడుతూ రక్తదానం చాలా గొప్పదని,మానవులు సృష్టించలేని రక్తం ఆపదలో ఉన్న వారికి సకాలంలో అందించటం వలన ప్రాణాలు కాపాడిన వారౌతారని,రక్తదానం ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ సంవత్సరానికి రెండు, మూడు మార్లు చేయవచ్చునని అన్నారు.

మనం మరొకరికి చేసే రక్తదానం ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుందని, రక్తదానం చేసిన సహచర మిత్రుడు శీలం నవీన్ కు ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు తెలిపారు.రక్తదానానికి కుల,మత బేధం లేదని,ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి స్వచ్చందంగా ముందుకు రావాలని,ఆపదలో ఉన్నవారిని కాపాడుకుందామని అన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

గ‌రుడ వాహ‌నంపై శ్రీ మ‌ల‌య‌ప్ప సాక్షాత్కారం

Satyam NEWS

భవన నిర్మాణ కార్మికులు బిఒసిడబ్ల్యు కార్డు పొందాలి

Satyam NEWS

గ్రామంలోనే ధాన్యం కొనుగోళ్లు: రైతుల ఖాతాల్లోకి నేరుగా నిధుల జమ

Bhavani

Leave a Comment