33.2 C
Hyderabad
May 4, 2024 01: 19 AM
Slider ప్రత్యేకం

ప్రజాభిప్రాయం లేకుండా మాస్టర్ ప్లాన్ రూపకల్పన

#kodandaram

ప్రజాభిప్రాయం లేకుండానే మాస్టర్ ప్లాన్ రూపొందించారని తెలంగాణ జనసమితి చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రూపకల్పనతో ఆత్మహత్య చేసుకున్న రాములు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. రాములు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. భూమి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కామారెడ్డి కలెక్టర్ ను కలిశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రైతు రాములు చనిపోవడానికి కారణం ప్రభుత్వమే కారణమన్నారు. ప్రభుత్వం రైతులకు ఇష్టం లేకుండా, రైతుల అభిప్రాయం తీసుకోకుండా భూముల తీసుకోడం ఏక పక్ష నిర్ణయమన్నారు. అభివృద్ధి పేరుతో కేసీఆర్ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలలో మాస్టర్ ప్లాన్ పేరుతో రైతులకు చెందిన సారవంతమైన రెండు పంటలు పండే  వ్యవసాయ భూములను తీసుకుంటున్నారని,  8 గ్రామాల రైతులకు సంబంధించిన పచ్చని పంట పొలాల భూములు పరిశ్రమలకు, నూతన రోడ్ల నిర్మాణంకు 2700 ఎకరాలు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ లో చేర్చారన్నారు.

ఈ భూములు మాస్టర్ ప్లాన్ లో చేర్చడం వల్ల  రైతులకు జీవనాధారం లేకుండా అవుతుందని పేర్కొన్నారు. తరతరాలుగా రైతులు ఈ భూములను నమ్ముకొని వ్యవసాయం చేస్తూ రెండు రకాల పంటలు పండిస్తున్నారని, ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా రైతుల బ్రతుకులు అగమ్యగోచరంగా మారుతుందన్నారు. ప్రభుత్వం ఈ ఆలోచన ను విరమించుకొవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి  అభివృద్ధి చేయాలని ఆలోచన ఉంటే ప్రభుత్వ భూములలోనే పరిశ్రమలు ఏర్పాట్లు చేయాలని, నూతన రోడ్ల నిర్మాణం చేయాలనుకుంటే రైతుల అభిప్రాయాలను సేకరించి నిర్మాణం చేయాలని సూచించారు.

మాస్టర్ ప్లాన్ విషయంలో ప్రభుత్వం  స్పందించకుంటే రైతుల పక్షాన కొట్లాడుతామని హెచ్చరించారు. రాములు కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి, 50 లక్షల ఎక్సగ్రెసియా ఇవ్వాలని, కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిజ్జన రమేష్, జిల్లా కన్వీనర్ లక్ష్మణ్ యాదవ్, రైతు విభాగం ఇంచార్జ్ మోహన్ రెడ్డి, జిల్లా నాయకులు రజినీకాంత్, బీసీ సంఘం నాయకులు నాగరాజు పాల్గొన్నారు.

ఆత్మహత్య చేసుకున్న రైతు రాములు కుటుంబాన్ని పరామర్శిస్తున్న కోదండరాం

Related posts

Harassment: కాకినాడలో ఆర్ట్ టీచర్ ఆత్మహత్య యత్నం

Satyam NEWS

గ్రూప్ 1 పరీక్షలు ఉర్దూలో రాయడానికి అనుమతించే GO రద్దు చేయాలి

Satyam NEWS

హెటిరో ల్యాబ్స్ ను సందర్శించిన సీబీఐటీ విద్యార్ధులు

Satyam NEWS

Leave a Comment