29.7 C
Hyderabad
April 29, 2024 07: 50 AM
Slider తూర్పుగోదావరి

వంద రోజులకు చేరుతున్న కొటారు గడప గడప యాత్ర

#Gadapa Gadapa Yatra

ఏలూరు జిల్లా దెందులూరు నియోజక వర్గం లో శాసన సభ్యులు కొటారు అబ్బయ్యచౌదరి చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శనివారం నాటికి 100 రోజులు పూర్తిచేసుకుని శత దినోత్సవ సంబరానికి సిద్ధం అవుతున్నది. ఈ సంబరాన్ని ఏలూరు రూరల్ మండలం మాదేపల్లిలో జరుపుకుంటుంది. ఈ కార్యక్రమానికి ఏలూరు, పెదవేగి, పెదపాడు, దెందులూరు మండ లాల నుండి పెద్ద ఎత్తున వై సి పి ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తరలి రానున్నారు.

అబ్బయ్య చౌదరి నేతృత్వం లో మొదటి రోజు నుండి 100వ రోజు వరకు జరిగిన గడప గడపకు మన ప్రభుత్వ కార్య క్రమాలలో ఆయా గ్రామాల ప్రజలు అబ్బయ్యచౌదరి పూలాభిషేకాలతో హారతులిచ్చి ఘన స్వాగతాలు
పలికారు. అవ్వ తాతల ను ఆప్యాయంగా పలకరిస్తూ, అక్క చెల్లెమ్మల అన్నగా అండగా నిలబడుతూ, అధికారులను, ప్రజాప్రతినిధులను గౌరవిస్తూ ఈ 100 రోజుల లో షెడ్యూల్ ప్రకారం ఎంచుకున్న గ్రామాలలో ఒక్క గడప ను కూడా వదలకుండా ఆ గడప లో అందుకున్న సంక్షేమ పథకాలు, అందుతున్న పింఛన్ లు అందకపోవడానికి కారణాలు, అందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటూ నేటికి శత దినోత్సవానికి చేరుకున్నారు.

ఈ 100 రోజుల లొనే సమయం చిక్కినప్పుడల్లా నియోజక వర్గం లో కుల మతాల కు అతీతంగా అనేక కారణాల వల్ల ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తూ, ప్రమాదాలలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలిస్తూ శుభ కార్యాలకు, శుభ కార్యాలకు హాజరౌతూ అన్ని వర్గాలను కలుపుకు పోతూ కార్యకర్తల నాయకుల ఆపదలో ఆదుకుంటూ రాజకీయ పౌరుషం లో తండ్రిని మించిన తనయుడిగా, జగనన్న చేతిలో బాణం గా పరిపాలనలో సౌమ్యుడిగా నియోజక వర్గంలో అభివృద్ధి సంక్షేమం కాంక్షిస్తూ దెందులూరు నియోజక వర్గం లో రాజకీయ వర్గ పోరు ను పరిరక్షిస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు.

శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత నిస్తూ, చదువుకున్న నిరుద్యోగ యువతకు జాబ్ మేళాల ద్వారా ఉద్యోగ ఉపాధి కల్పిస్తూ, రైతు బిడ్డగా సమాజం లో సామాజిక ఆర్థిక అసమానతలు పట్ల అవగాహన కలిగిన మంచి పరిపాలన అందించే శాసన సభ్యునిగా పెరు గడించి యంగ్ అండ్ డైనమిక్ యువ పొలిటికల్ లీడర్ గా పేరు పొందారు.

Related posts

పైసా ఖర్చు లేని బదిలీలను వెంటనే చేపట్టాలి: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

Satyam NEWS

పెండ్యాల కోటేశ్వరరావు జీవితం భావితరాలవారికి ఆదర్శం

Satyam NEWS

ఛలో విజయవాడ: చెలరేగిన ఎన్నో ప్రశ్నలు….

Satyam NEWS

Leave a Comment