38.2 C
Hyderabad
May 3, 2024 21: 25 PM
Slider ప్రత్యేకం

మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

#ministerharishrao

కొత్తగా మంజూరు అయిన మెడికల్ కళాశాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కలెక్టర్లను ఆదేశించారు.  బుధవారం సాయంత్రం ఎనిమిది జిల్లాల కలెక్టర్లు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్, ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య విధాన పరిషత్ 330 బెడ్ ల పెంపుకై చేపడుతున్న అదనపు నిర్మాణాలతో పాటు వైద్య కళాశాల భవన సముదాయాలు సకాలంలో పూర్తి చేస్తేనే ఈ విద్యా సంవత్సరంలో కళాశాలలో నడుస్తాయని లేని పక్షంలో విద్యార్థులు సైతం నష్టపోతారని పేర్కొన్నారు. 

నాగర్ కర్నూల్ వైద్య కళాశాల, 210 పడకల అదనపు నిర్మాణాల పురోగతి పై మంత్రి సమీక్షిస్తూ రాత్రి పగలు షిప్ట్ ల వారిగా పనిచేస్తే తప్ప సకాలంలో పూర్తి కాదని కలెక్టర్ ను సూచించారు. శాసన సభ్యులు,కలెక్టర్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్, ఇంజనీరింగ్ అధికారులు భాగస్వాములై సమన్వయంతో వెంటపడి పని చేయించాలని సూచించారు.  ఇప్పటికే కేంద్ర పరిశీలకులు పర్యటించి కొత్త కళాశాలల పురోగతి పరిశీలిస్తున్నారని వారు వచ్చే లోపు సాధ్యమైనంత ఎక్కువ పని పూర్తి చేసి ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.  ఒక షెడ్యూల్ ప్రకారం ఏ రోజుకు ఆరోజు చేయాల్సిన పని ఎంత పూర్తి అయిన పని ఎంత అనేది బేరీజు వేసుకుంటూ రాత్రింబవళ్లు పని జరిగేవిధంగా చూడాలని సూచించారు. 

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో చేపడుతున్న అదనపు పడకల నిర్మాణ పనులు ఫ్లోరింగ్ పని నడుస్తుందని, ఫిబ్రవరి చివరి నాటికి పూర్తి అవుతుందని తెలిపారు.  వైద్య కళాశాల నిర్మాణ పనులు మార్చి చివరి నాటికి పూర్తి అయ్యే విధంగా యుద్ధప్రాతిపదికన పని చేయిస్తామని  తెలియజేశారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ అలీ మూర్తుజా రిజ్వి, డైరెక్టర్ రమేష్ రెడ్డి, నాగర్ కర్నూల్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. రమాదేవి, ఆర్.అండ్ బి ఎస్.ఈ. నర్సింగమ్, ఈ.ఈ. భాస్కర్, ఆసూపత్రి సూపరిండెంట్ డా.  శివరాం తదితరులు పాల్గొన్నారు.

Related posts

27న ఆర్.ఎమ్.ఎస్.గ్రూప్స్ కంపెనీ ప్రారంభించనున్న హీరోయిన్ పూర్ణ

Satyam NEWS

కరణం బలరాంపై పోరాటానికి కరణం అంబిక క్రిష్ణ సిద్ధం

Satyam NEWS

Selection process: వీర విధేయుడుకే పగ్గాలు!

Satyam NEWS

Leave a Comment