28.7 C
Hyderabad
May 15, 2024 00: 12 AM
Slider నల్గొండ

వక్ఫ్ బోర్డు అధికారులకు కనువిప్పు కలగాలని అల్లాకు వినతి

#hujurnagarmunicipality

18వ రోజుకు చేరుకున్న ముస్లిం సోదరుల నిరసనలు

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ముస్లిం సోదరుల నిరసనలు18వ రోజుకు చేరింది. మసీదు కాంప్లెక్స్ అక్రమదారుల విషయంలో వక్ఫ్ బోర్డు యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని, మసీదు అభివృద్ధి చెందాలని, సమస్యలను త్వరితగతిన పరిష్కారం కావాలని ఉర్దూ మదర్సాలో చదివే పిల్లలు ప్రత్యేక ప్రార్థనా దువా చేసి అధికారులను వేడుకున్నారు.

ముస్లిం సోదరుల శాంతియుత నిరసన ఉద్యమాలలో భాగంగా బుధవారం ఉర్దూ మదర్సాలలో చదివే విద్యార్థులు పవిత్ర ఖురాన్ పఠించి ప్రత్యేక ప్రార్థనల ద్వారా అల్లాను వేడుకున్నారు. తమ సమస్యను త్వరగా అల్లా ద్వారా అధికారులకు కనువిప్పు కలగాలని ప్రార్థనలు చేసి,సమస్యను త్వరగా పరిష్కరించాలని అల్లాను వేడుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం చిన్నారులు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా ఉస్మానియా మసీదు వక్ఫ్ షాపింగ్ కాంప్లెక్స్ లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని, మసీదు కాంప్లెక్స్ లో ఉంటూ మసీదు అభివృద్ధి చెందకుండా చెయ్యటం బాధాకరమైన విషయమని చిన్నారి ముస్లీంలు వాపోయారు.

అక్రమ లీజు దారుల   మనసులు మార్చాలని,మసీదు కమిటీ నిర్ణయించిన అద్దెలు చెల్లించాలని,అక్రమ లీజు దుకాణ దారులపై చర్యలు తీసుకోవాలని,మసీద్ దుకాణాలను వెంటనే బహిరంగ వేలం వేసి హుజూర్ నగర్ పట్టణంలో అనేక మంది ముస్లిం సోదరులు దుకాణాలు లేక  ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

వారికి ఇందులో అవకాశం కల్పించాలని కోరారు. సంవత్సరాల తరబడి అగ్రిమెంట్ లేకుండా అక్రమ పద్ధతిలో ఉన్న కిరాయి దారులు మసీదుకు నామమాత్రపు అద్దె చెల్లించి నెలకు వేల రూపాయలు అద్దె, లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకుంటున్నారని,మసీదు షాపులలో ముస్లింలకు అవకాశం లేకుండా చేస్తున్న వారి,మసీదు కమిటీకి 25 సంవత్సరాల నుండి అద్దెలు పెంచకుండా అడ్డుకుంటున్న వారి మనసు మార్చి మసీద్ అభివృద్ధికి తోడ్పడే విధంగా అల్లాను ప్రార్థన చేసి ఖురాన్ పఠించామని చిన్నారి ముస్లీం సోదరులు అన్నారు.

హుజూర్ నగర్ పట్టణంలోని 7 మసీదులలో పనిచేసే ఇమామ్,మౌజన్, ఉర్దూ టీచర్,వాచ్ మెన్ మేతర్, ఎలక్ట్రిషన్,బిల్ కలెక్టర్లకు12 నెలల నుండి జీవనభృతి లేకుండా చేసిన వారిని,మసీదులో అత్యవసర అసౌకర్యాలు లేకుండా చేస్తూ అభివృద్ధి అడ్డుకుంటున్న వారి,మనసు మారాలని, తక్షణమే వక్ఫ్ బోర్డు అధికారులు స్పందించాలని,మసీదు అభివృద్ధి అడ్డుపడుతున్న వారిని వెంటనే ఖాళీ చేయించాలని అనునిత్యం ఖురాన్ పఠిస్తున్న ముస్లీం చిన్నారులు ప్రత్యేక ప్రార్థనలు చేసి అల్లాకు దువా చేశారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మైనారిటీ రాష్ట్ర నాయకులు ఎండీ అజీజ్ పాషా,షేక్ జానీ నవాబ్ లు మాట్లాడుతూ 12 నెలలుగా అద్దెలు చెల్లించనందున డిఫాల్టర్లు లిస్టులో పెట్టి వెంటనే ఖాళీ చేయించాలని,వక్ఫ్ బోర్డు యాక్ట్ ప్రకారం అట్టి దుకాణ దారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు ముఫ్తీ రఫిసాబ్, మహ్మద్. అబ్దుల్ రహీం పాషా, షేక్.సైదా,మజారొద్దీన్,సిద్దిఖీ, సాదిక్, రెహ్మాన్,ఖలిద్, అఫ్రోజ్, తాజుద్దీన్, సౌకత్, హలీమ్, షరీఫ్, వసీన్, జాబిరు,అబ్దుల్లా, ఖాసిం,ముస్తఫా,సలీమ్,హఫీజ్,భాష, జానీమియా,గౌస్ ఖాన్,మీరా,ఖాజా, ఇబ్రహీం, రసూల్, మజీద్, జనీ,మెయిన్, ఫేరోజ్,అఫ్గాన్,నాగులు,సిరాజ్, యాసిన్,అన్వర్,గౌస్,లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

Over The Counter Acai Berry Supplements Weight Loss Depression Pills With Weight Loss Side Effects

Bhavani

బక్రీద్ ప్రార్ధనల్లో పాల్గొన్న అంబర్ పేట్ ఎమ్మెల్యే                      

Satyam NEWS

పేదల ఇళ్ల నిర్మాణంపై జగన్ కు చిత్తశుద్ధిలేదు

Satyam NEWS

Leave a Comment