29.7 C
Hyderabad
May 1, 2024 05: 44 AM
Slider విజయనగరం

13 న విజయనగరానికి ఏపీ రాష్ట్ర డీజీపీ…!

#APDGP

అదే రోజు నగరంలో 3 కొత్త భవనాలు ప్రారంభం…!

ఏపీ రాష్ట్ర పోలీసు డీజీ గౌతమ్ సవాంగ్ విజయనగరం రానున్నారు. ఈ నెల 13వ తేదీన డీజీపీ విజయనగరం జిల్లా కేంద్రంలో పోలీసు శాఖ ఏర్పాటు చేసిన మూడు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం… అదే.రోజు విజయనగరం సబ్ డివిజన్ పరిధిలోని టూటౌన్ పోలీసు స్టేషన్ కొత్త భవనాన్ని డీజీపీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు అడిషనల్ ఎస్పీ అనిల్ సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.

అలాగే జగన్ ప్రభుత్వానికి ప్రీతిపాత్రమైన “దిశ” పోలీసు స్టేషన్ లో కొత్త నిర్మాణాలను డీజీపీ చేతులు మీదుగా ప్రారంభించేందుకు ఎస్పీ దీపికా సన్నధ్ధం అవుతున్నారు.అలాగే డీజీపీ కి అత్యంత ఇష్టమైన సైబర్ సెల్ ను పనిలో పనిగా ప్రారంభించేందుకు సైబర్ సెల్ పోలీసులు తయారవుతున్నట్టు సమాచారం.

ఇక దాదాపు ఏడాదిన్నర నుంచీ అదిగో ఇదిగో అంటూ ప్రారంభానికి నోచుకోని కొత్తపేట లో సిద్ధంగా ఉంది..టూటౌన్ పోలీసు స్టేషన్. ఆ స్టేషన్ ను కొత్త సీఐ వచ్చి దాదాపు ఏడాది అవుతున్న..ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. ఆ స్టేషన్ భవన నిర్మాణ కాంట్రాక్ట్…మరో జిల్లా వెళ్లిపోయి..ఉపాధి పొందుతున్న…ఇంకా కొత్త పోలీసు స్టేషన్ భవనం ప్రారంభం కాలేదు.

ఇటీవల విజయనగరం సబ్ డివిజన్ పోలీసు అధికారి అనిల్ కు అదనపు ఎస్పీ గా పదోన్నతి పొంది..డీజీపీ చే ఏఎస్పీ గా అర్హత పొందారు. ఆ సందర్భంలో నే విజయనగరం లో కొత్త టూటౌన్ పోలీసు స్టేషన్ భవనాన్ని ప్రారంభించేందుకు రావాలని కూడా ఏసీపీ కోరినట్టు సమాచారం. ఈ క్రమంలో కొత్తపేట లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న టూటౌన్ పీఎస్ ను ఏఎస్పీ అనిల్…ఎస్పీ ఆదేశాలతో పరిశీలించారు కూడా. ఈ క్రమంలో నే అటు “దిశ” పీఎస్ లో కొత్త నిర్మణాలు కూడా పూర్తవ్వడంతో దీన్ని కూడా డీజీపీ చే ప్రారంభించేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉన్న ట్టు తెలుస్తోంది.

ఇక విజయనగరం పోలీసు సబ్ డివిజన్ ఆఫీసు పక్కనే రూపుదిద్దుకుంటున్ప పెట్రోల్ బంక్ ను కూడా డీజీపీ అదే రోజు ప్రారంభించనున్నట్టు సమాచారం. ఇంతవరకు విజయనగరం పోలీసు శాఖ సిబ్బంది… పెట్రోల్ కోసం చింతలవలస వెళ్లాల్సి వచ్చేది.కానీ గత ఎస్పీ రాజకుమారి ఆధ్వర్యంలో డీఎస్పీ ఆఫీసు పక్కనే కొత్త పెట్రోల్ బంక్ కు శంకుస్థాపన చేయడం జరిగింది. గతేడాది జూన్ లో ఎస్పీ గా చార్జ్ తీసుకున్ప దీపికా.. సమక్షంలో కొత్త పెట్రోల్ బంక్ ప్రారంభం కానుంది.ఈ నేపథ్యంలో ఈ నెల 13న డీజీపీ విజయనగరం పర్యటన ఖరారైనట్టు సమాచారం. ఏది ఏమైనా దాదాపు ఏడాదిన్నర తర్వాత రాష్ట్ర డీజీపీ.. విజయనగరం రానున్నట్లు సమాచారం.

Related posts

370, 35A: బిల్లుకు మద్దతు కోసం ప్రధాని వినతి

Satyam NEWS

వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

Satyam NEWS

నటుడు శివాజీపై లుకౌట్ నోటీసులు తొలగింపు

Satyam NEWS

Leave a Comment