40.2 C
Hyderabad
May 5, 2024 15: 48 PM
Slider మహబూబ్ నగర్

ప్రభుత్వ ఆస్పత్రిలో సమస్యలను వెంటనే పరిష్కరించాలి

#hinduvahini

వనపర్తిలోని  జిల్లా ప్రభుత్వ  ఆసుపత్రిలో గర్భిణీలకు పరీక్షించే అల్ట్రాసౌండ్ పరికరాలు ఉన్న ప్రైవేటు స్కానింగ్ సెంటర్లకు బారులు తీరుతున్నారని వనపర్తి  పట్టణ హిందూ వాహిని పాలమూరు విభాగ్ కన్వీనర్ అభిలాష్ హౌదేకార్, అధ్యక్షుడు రోహిత్, ఉపాధ్యక్షుడు నరేష్, ప్రధాన కార్యదర్శి రాకేష్ ,చరన్ , సిద్దు, వినయ్, జగన్,  రఘు, బాలు తెలిపారు. అల్ట్రాసౌండ్, సంబంధిత రేడియాలజిస్ట్ పోస్టులు ఖాళీగా ఉండడం, దాన్ని భర్తీ చేయకపోవడం, గైనకాలజిస్ట్ మహిళలను ప్రైవేట్ స్కానింగ్  సెంటర్ లకు స్కానింగ్  కొరకు పంపుతున్నారని చెప్పారు.

దీన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ల వారు వేలకు వేలు రూపాయలు వసూలు చేస్తున్నారని తెలిపారు.  జిల్లా కేంద్రంలో ఒక స్కానింగ్ సెంటర్ దగ్గర ప్రజలు పడిగాపులు కాస్తున్నారని, ఎర్రటి ఎండలో  అస్వస్థతకు గురవుతున్నారని చెప్పారు. అలాగే 29  ఆక్సిజన్ వెంటిలేర్స్ ఉన్నపటికీ సంబంధిత వైద్యులు లేక నిరుపోయోగంగా మారాయని, దీంతో లక్షలు పెట్టిన పరికరాలు నిరుపయోగంగా ఉన్నాయని విమర్శించారు. 

జిల్లా పరిధిలో ఇలాంటి సమస్యలు  మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని హిందూ వాహిని వనపర్తి పట్టణ శాఖ తరుపున డిమాండ్ చేస్తు హిందూ వాహిని అభిలాష్జి ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో   హిందూ వాహిని కార్యకర్తలు పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

క్యాస్ట్ పాలిటిక్స్: పాతది నాశనం కొత్తదానికి శ్రీకారం

Satyam NEWS

ఎనాలసిస్: మళ్లీ లాక్ డౌన్ వైపు చూస్తున్న పలుదేశాలు

Satyam NEWS

ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి ని విమర్శించే స్థాయి భత్యాల కు లేదు

Satyam NEWS

Leave a Comment