33.7 C
Hyderabad
February 13, 2025 20: 31 PM
Slider సినిమా

మీటింగ్ విత్ మోడీ: జగన్ సైడ్ నుంచి కమలానికి జెంప్?

mohanbabu modi

సినీ నటుడు మోహన్‌బాబు తన కుమార్తె మంచు లక్ష్మి, కుమారుడు మంచు విష్ణు, కోడలు విరోనికతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం భేటీ అయ్యారు. ఈ భేటీతో ఆయన బీజేపీలో చేరనున్నారన్న ప్రచారం జోరందుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా మోహన్‌బాబును బీజేపీలోకి ఆహ్వానించడంతో ఈ ప్రచారానికి బలం చేకూరింది.

ప్రధానితో మోహన్‌బాబు దాదాపు అరగంటకు పైగా చర్చలు జరిపినట్లు తెలిసింది. మోదీతో భేటీ తర్వాత మంచు లక్ష్మి ఈ సమావేశానికి సంబంధించి ట్వీట్ చేసింది. ఇప్పుడే డైనమిక్‌ ప్రధాని మోదీని కలిశామని, మోదీ సారధ్యంలో భారత్‌ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని మంచు లక్ష్మి ట్వీట్ చేసింది.

ఇదిలా ఉంటే.. సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మోహన్‌బాబు భేటీ కానున్నట్లు సమాచారం. సోమవారం నెలకొన్న ఈ తాజా పరిణామాలతో మంచు కుటుంబం వైసీపీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

Related posts

ఏలూరు లో తపాలా అవగాహన వారోత్సవాలు

mamatha

ఎన్నో ఫెయిల్యూర్స్‌ చూశా.. నాన్నే నాకు స్ఫూర్తి

mamatha

కొల్లాపూర్ ఎమ్మెల్యే తల్లి విరాళం లక్ష రూపాయలు

Satyam NEWS

Leave a Comment