ఫిబ్రవరి 8 న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అదే నెల 11వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 14 న జారీ చేయనున్నారు. నామినేషన్ల సమర్పణల గడువు జనవరి 21గా ఉంది. నామినేషన్ల ఉపసంహరణ తేదీ జనవరి 24 అని ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా తెలిపారు. ఒకే దశలో ఫిబ్రవరి 8 న ఎన్నికలు జరుగుతాయి.
ఫిబ్రవరి 11 న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఢిల్లీ అసెంబ్లీ ప్రాంతంలో మొత్తం 1,46,92,136 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 80,55,686 మంది పురుషులు, 66,35,636 మంది స్త్రీలు, 815 భిన్న లింగసంపర్కులు ఉన్నారు. శాసనసభ మొత్తం స్థానాలు 70. 2015 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాలలో గెలిచింది. మిగిలిన మూడు స్థానాలలో బిజెపి గెలిచింది. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.