గుంటూరు జిల్లా నరసరావుపేట ఘనతను పొరుగు రాష్ట్రంలో చాటిన స్మిమ్మింగ్ ఛాంపియన్ సయ్యద్ వసీం అక్రమ్ ను నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అభినందించారు. నేడు నరసరావుపేటలో డాక్టర్ అరవింద బాబును కలిసిన సయ్యద్ వసీం అక్రమ్ తాను సాధించిన పతకాన్ని చూపించాడు.
ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు గచ్చిబౌలి స్టేడియం, హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ వారు 32వ సౌత్ జోన్ జాతీయ స్థాయి స్విమ్మింగ్ -2020 పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో పాల్గొన్న సయ్యద్ వసీం అక్రమ్ Bronze Medal ను (Water Polo) సాధించాడు. నరసరావుపేట ఎస్.ఎస్ &ఎన్ కళాశాలకు చెందిన స్విమ్మింగ్ పూల్ క్రీడాకారుడు సయ్యద్ వసీం అక్రమ్ ను స్విమ్మింగ్ కోచ్ షేక్ ఖాజా మొహిద్దీన్ ను డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అభినందించారు.