31.2 C
Hyderabad
May 3, 2024 02: 38 AM
Slider నల్గొండ

మేము సైతం అంటూ పోటీలకు సిద్ధపడ్డ భవాని,శ్రీజ

#hujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ళచెరువు గ్రామ ప్రతిష్టను గల్లి నుండి ఢిల్లీకి పెంచేలా ఉపాధ్యాయులు చేస్తున్నారు. పేద కుటుంబాల విద్యార్ధినిలను ఎంపిక చేసి వారికి  విద్యతో పాటు వారిలోలో దాగి ఉన్న క్రీడా ప్రావీణ్యాన్ని బయటకు తీస్తున్నారు. ఆటపై ఉన్న మక్కువను ఉపాధ్యాయులు గుర్తించి విద్యార్ధినిల ఎదుగుదలకు ప్రతిక్షణం కృస్తున్నారు.

వారిలో ఆటల పట్ల దాగివున్న ప్రజ్ఞను వెలికితీసి వారిని జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగానే నేడు మేళ్ళచెరువు గ్రామానికి చెందిన బండి చైతన్య భవాని హుజూర్ నగర్ జడ్పీహెచ్ఎస్ లో చదువుతున్నది. పాఠశాల పీఈటీ నాగు ఆమెలోని క్రీడా స్ఫూర్తిని గ్రహించి కబడ్డీ క్రీడల మెళకువలు నేర్పి ఉత్తమమైన క్రీడాకారిణిగా తీర్చిదిద్దారు. పేద కుటుంబంలో బ్రతుకు బండిని లాగిస్తూనే విద్యపై ఉన్న పట్టుదలను వదలకుండా ఆటపై దృష్టి సారిస్తూ తల్లి జానకమ్మ కలను నెరవేర్చింది.

ఆమె కష్టాలను ఎదుగుదలకు పునాదులుగా మార్చుకుని జాతీయస్థాయిలో ఎంపిక సిద్ధంగా ఉన్నానంటున్న భవాని కి సమఉజ్జి గా మరో పేదింటి క్రీడా ముత్యం గుండ్ల శ్రీజ రూపొందింది. మేళ్ళచెరువులోని అభ్యాస్ విద్యాలయంలో అభ్యసించే సమయంలో ఆ పాఠశాల పి ఈ టి గా పనిచేస్తున్న సతీష్ ఆమె ప్రతిభను గుర్తించి కబడ్డీ పోటీలలో ప్రోత్సహించడం జరిగింది.

అందుకు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి  ఎంతో కృషి చేశారు. ఇరువురి క్రీడా మణులలోని ప్రతిభను గుర్తించిన జిల్లా సెక్రెటరీ నర్సింహారావు, బెల్లంకొండ రామచంద్ర గౌడ్,తురక రమేష్ బాబు  పీఈటి ల ప్రోత్సాహంతో  47వ,  ఇంటర్ డిస్టిక్ స్టేట్ మెట్ మహాబూబాబాద్ మొదటి స్థానం,67వ, సీనియర్ స్టేట్ మెట్ బోడప్పల్ లో మొదటి స్థానం సాధించడం జరిగింది.

రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 13న, ఆదివారం జరిగే జాతీయ స్థాయి ప్రబుల్స్ కి జిల్లా నుండి మేళ్ళచెరువు గ్రామానికి చెందిన చైతన్య భవాని,శ్రీజ లు ఎంపిక అయినట్లు సూర్యాపేట జిల్లా కార్యదర్శి నామ నరసింహారావు  తెలిపారు. వీరి ఎంపిక పట్ల మేళ్లచెరువు మండల అధ్యక్షుడు శెట్టి రామచందర్ రావు,వ్యాయమ ఉపాధ్యాయులు విశ్వజ్ఞానా చారి, గ్రామ ప్రజలు అభినందనలు తెలియజేశారు. జాతీయ స్థాయి క్రీడల్లో విజయం సాధించాలని కోరుకుందాం.

Related posts

ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ

Murali Krishna

27న విద్యార్ధులతో ప్రధాని మోడీ చర్చ

Satyam NEWS

శ్రీవారి ఆలయ‌ నిర్మాణ పనులకు వడివడిగా అడుగులు

Bhavani

Leave a Comment