29.7 C
Hyderabad
May 3, 2024 05: 06 AM
Slider విజయనగరం

ప్ర‌సిద్దిగాంచిన విజ‌య‌న‌గ‌రం సంగీత‌ క‌ళాశాల‌లో క‌చేరీలు….!

#vijayanagaram

ప్ర‌తీరోజూ క‌ళాశాల విద్యార్ధుల‌చే….నెల‌రోజుల పాటు క‌చేరీలు

ఓ ఘంటశాల‌, ఓ సుశీల‌..ఆ ద్వారం వెంక‌ట‌స్వామి నాయుడు, ఓ ఆదిభ‌ట్ల‌నారాయ‌ణ‌దాసు  ఇలా ఎంద‌రో మ‌హానుబావులు న‌డియాడిన క‌ళాశాల‌….విజ‌య‌న‌గ‌రం మ‌హారాజాప్ర‌భుత్వ సంగీత క‌ళాశాల‌.క‌ళాశాల స్థాపించి వందేళ్ల పూర్తి చేసుకున్న సంగీత క‌ళాశాల‌లో ప‌లు వాయిద్యాల‌ను నేర్చుకుంటూ త‌మలోఉన్న క‌ళ‌ను ఓవైపు వెలికి తీయ‌డం మ‌రోవైపు నేర్చుకోవ‌డం ఇంకోవైపు వృద్ది చేసుకునేందుకు వ‌స్తూంటారు. రెండేళ్ల క్రితమే…అప్ప‌టి మంత్రి గంటా శ్రీనివాస‌రావు చేతుల మీదుగా క‌ళాశ‌లలోఆధునీక‌ర‌ణ ప్రారంభం కూడాజ‌రిగింది. ఈ క‌ళాశాల‌లో  క‌ళ‌ను అభ్య‌సించిన వారే….ప్ర‌పంచ వ్యాప్తంగా తాము నేర్చుకున్న విద్య‌ను ప్ర‌ద‌ర్శించి విజ‌య‌న‌గ‌ర ప్రాభ‌వాన్ని చాటుతున్నారు. అటువంటి క‌ళాకారుల‌కు పుట్టినిల్లు అయిన  మ‌హారాజా సంగీత క‌ళాశాల‌లోని క‌చేరీలు ఇవ్వ‌డం నిజంగా  ఓ అదృష్ట‌మే.ఇక ఈ క‌ళాశాల ప్రిన్సిప‌ల్ అయిదు నెల‌ల క్రితం వ‌చ్చిన  ప్రిన్సిప‌ల్  ప్ర‌స‌న్న‌కుమారీ…ఇదే క‌ళాశాల‌లో నృత్యం నేర్చుకున్నారు.ఇక ప్ర‌తీ రోజూ  ప‌లు విభాగాల  గురువులు  త‌మ‌,త‌మ‌క‌ళ‌ల‌ను విద్యార్దులు బోధిస్తున్న వేళ‌….నిరంత‌రం అభ్యాస సాధ‌న‌లో భాగంగా  క‌ళ‌ల‌ను నేర్చుకుంటున్న విద్యార్దుల‌చే నెల‌వారీ క‌చేరీలు ఏర్పాటు చేసింది..క‌ళ‌శాల‌.ఈ మేర‌కు ఈ నెల 11 నుంచీ ఆ క‌చేరీలు ప్రారంభం అయ్యాయి. స్టేజ్ మీద పాడ‌టం. బ‌హిరంగంగా క‌చేరీలు ఇవ్వ‌డం…వంటి  గుణాలు…క‌ళ‌ను నేర్చుకుంటున్నవిద్యార్ధుల‌లో క‌ల‌గ చేసేందుకే ఈ క‌చేరీలను నిర్వ‌హిస్తున్నామ‌ని…ప్రిన్సిప‌ల్  తెలిపారు.

Related posts

భారత్ జోడో సరే రాజస్థాన్ కాంగ్రెస్ జోడో ఎప్పుడు?

Satyam NEWS

నలంద కిషోర్ మరణం పోలీసులు చేసిన హత్య

Satyam NEWS

కాంగ్రెస్ నేతలు తెలివిలేనోళ్ళైతే బిఆరెస్ నేతలిది అతి తెలివి

Bhavani

Leave a Comment