39.2 C
Hyderabad
May 3, 2024 13: 38 PM
Slider నిజామాబాద్

భారతీయ కిసాన్ సంఘ్ లో లక్ష సభ్యత్వాలు చేస్తాం

#bharateeyakisansangh

కామారెడ్డి జిల్లాలో భారతీయ కిసాన్ సంఘ్ లో లక్ష మంది రైతుల సభ్యత్వం చేస్తామని భారతీయ కిసాన్ సంఘ్ క్షేత్ర సంఘటన మంత్రి రాము అన్నారు. శనివారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగపూర్ శివారులో గల బృందావన్ గార్డెన్లో భారతీయ కిసాన్ సంఘ్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లాలోని పలు మండలాల నుంచి సుమారు 400 మంది రైతులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా కిసాన్ సంఘ్ క్షేత్ర సంఘటన మంత్రి రాము, జాతీయ కార్యవర్గ సభ్యుడు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామన్నారు. గత కమిటీలు 2024 మార్చ్ 31 తో పాత కమిటీల కాలం ముగుస్తుందని, ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు అన్ని గ్రామాల్లో సభ్యత్వ అభియాన్ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. కామారెడ్డి జిల్లాలో భారతీయ కిసాన్ సంఘ్ లో లక్ష మంది రైతుల సభ్యత్వం చేయడమే ప్రధాన ఉద్దేశ్యమని, దేశ వ్యాప్తంగా లక్ష గ్రామాల్లో కోటి పైగా సభ్యత్వాలు చేయబోతున్నామన్నారు.

జిల్లాలోని అన్ని గ్రామాల్లో కిసాన్ సంఘ్ కమిటీలు వేయాలని, భారతీయ కిసాన్ సంఘ్ లేని మండలం ఉండకూడదని తెలిపారు. భారతీయ కిసాన్ సంఘ్ దేశభక్తి కలిగిన సంఘమని, దేశం గురించి పనిచేసే సంఘమని తెలిపారు. దేశంలోని రైతులంతా బాగుండాలని కోరుకునే సంఘమని పేర్కొన్నారు. కిసాన్ సంఘ్ లో ప్రతి రైతు నాయకుడేనని, ఇందులో ఏకవ్యక్తి  నిర్ణయాలు ఉండవని, కేవలం సామూహిక నిర్ణయాలు మాత్రమే ఉంటాయన్నారు.

వ్యవసాయం సంక్షోభంలో లేదని, రైతు మాత్రమే సంక్షోభంలో ఉన్నాడన్నారు. వ్యాపారులు బాగానే ఉన్నారని,  రైతు మాత్రమే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాడని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించే ధరకు రైతుల పంటను కొనుగోలు చేసే నాధులే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలపై చేసే ఉద్యమాలు ఆహార ధాన్యాల పెరుగుదలపై చేయాలని సూచించారు.

నూటికి 60 శాతం మందికి ఉపాధి కల్పించే రంగం వ్యవసాయ రంగమని, 40 శాతం మందికి మిగతా రంగాలు ఉపాధి కల్పించలేకపోతున్నాయని విమర్శించారు. రైతాంగ సమస్యలపైనే కిసాన్ సంఘ్ నిరంతర పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా విద్యుత్ శాఖ ఎస్.ఈ రమేష్ బాబును రైతులు శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు లొంక వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షుడు పైడి విఠల్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంజయ్య, నగేష్, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

ఏప్రిల్ 21న 8వ విడ‌త‌ అఖండ బాలకాండ పారాయ‌ణం

Satyam NEWS

దొడ్డి కొమురయ్య జయంతి, వర్థంతి గ్రామగ్రామాన నిర్వహించాలి

Satyam NEWS

17న టీ సేవ్

Bhavani

Leave a Comment