34.7 C
Hyderabad
May 5, 2024 00: 53 AM
Slider వరంగల్

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అటవీ శాఖ సిబ్బందికి వైద్య శిబిరం

#medicalcamp

లయన్స్ క్లబ్ ములుగు మరియు లయన్స్ క్లబ్ సికింద్రాబాద్ వివేకానందపురం సంయుక్త ఆధ్వర్యంలో ములుగు జిల్లా ఆసుపత్రి వారి సహకారంతో ములుగు జిల్లా అటవీ శాఖాధికారి రాహుల్ కిషన్ జాదవ్ అభ్యర్ధన మేరకు జిల్లా అటవీ శాఖ సిబ్బందికి ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. జిల్లా అటవీ శాఖ సిబ్బందికి ప్రత్యేక వైద్య శిబిరం ద్వారా పరీక్షలు నిర్వహించారు.

ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన ములుగు డివిజన్ అటవీ అధికారి రాహుల్ జాదవ్ మాట్లాడుతూ రాత్రి, పగలు అడవులలో తిరుగుతూ వాటిని సంరక్షించే సిబ్బందికి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవటం చాలా ముఖ్యమని, అందుకే ఎవరికైనా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తెలిస్తే జాగ్రత్త పడతారనే ఉద్దేశ్యంతో  లయన్స్ క్లబ్ పింగిలి నాగరాజుని సంప్రదించగా ములుగు క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ పూజారి రఘు మరియు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్వర్  వెంటనే స్పందించి వైద్య పరీక్ష శిబిరం నిర్వహణకు ముందుకు వచ్చారని తెలిపారు.

సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్వర్ మాట్లాడుతూ ఆసుపత్రి వైద్య బృందం సహకారంతో టీ-హబ్ ద్వారా అటవీ సిబ్బందికి వివిధ రక్త పరీక్షలు, బీపీ, షుగర్, కంటి మరియు దంత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆసుపత్రి రక్త నిధికి రక్త దానం చేసిన అటవీ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు వైద్య శిబిరం ద్వారా ములుగు డివిజన్ పరిధిలోని 90 మంది అటవీ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించగా లయన్స్ క్లబ్ వారు ఉచితంగా మందుల పంపిణీ చేశారు.

రక్త దానం చేసిన అటవీ సిబ్బంది

రక్త నిధిలో కొరత దృష్ట్యా రక్త దానం చేయమని సూపరింటెండెంట్ అభ్యర్ధన మేరకు స్పందించిన డివిజన్ అటవీ అధికారి జోగేందర్  స్వయంగా రక్త దానం చేసి స్ఫూర్తి నింపగా అటవీ సిబ్బంది 13 మంది రక్త దానం తమ సహృదయాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో వివేకానందపురం క్లబ్ డైరెక్టర్ పింగిలి నాగరాజు, ములుగు క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ పూజారి రఘు, సెక్రెటరీ చుంచు రమేష్, కోశాధికారి కొండి సాంబశివ, సానికొమ్ము రవీందర్ రెడ్డి, ఉదయ్, బలరాం రెడ్డి, సుబ్బారెడ్డి, ఆసుపత్రి వైద్యులు ప్రవీణ్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి,  సుజిత్ కుమార్, సతీష్, భరత్, సంబంధిత శాఖల పీజీ వైద్య విద్యార్థులు, పారా మెడికల్ సిబ్బంది మరియు ములుగు డివిజన్ అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

హోంగార్డ్స్ ఆదర్శంగా నిలవాలి

Murali Krishna

అమెరికాలో కిడ్నాప్ అయిన సిక్కు కుటంబం దారుణ హత్య

Satyam NEWS

టీడీపీ అనాలోచిత విధానాల వల్లే ఇబ్బంది పడ్డ ఇమామ్ లు

Satyam NEWS

Leave a Comment