కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించిన సందర్భంగా గుంటూరు జిల్లా నరసరావుపేట మజ్లీస్ పార్టీ పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. నేడు నరసరావుపేట మార్కెట్ సెంటర్ లో ఎంఐఎం నాయకుడు మస్తాన్ వలి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యతిథులుగా నరసరావుపేట RDO, MRO, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా RDO మాట్లాడుతూ పట్టణ ప్రజలు ఈనెల 31 వ, తారీకు దాకా ఎవరు బయటకు రాకుండా ఉండాలి, ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప బయట తిరగాలని అలాగే పరిశుభ్రత పాటించాలి అని తెలిపారు.
MRO మాట్లాడుతూ ఎవరైనా విదేశాల నుంచి వచ్చినట్లు ఉంటే మాకు సమాచారం ఇవ్వాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఎవరికైనా బాగా దగ్గు జలుబు ఆయాసం జ్వరం ఉంటే వెంటనే సంబంధిత ఆసుపత్రి లో పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమం లో ఎంఐఎం పార్టీ నాయకులు మౌలాలి రియాజ్, మసూద్, తసీన్, అహమ్మద్, అర్షద్, దావుద్, గౌస్ జక్రియ, తదితరులు పాల్గొన్నారు.