28.7 C
Hyderabad
April 27, 2024 04: 25 AM
Slider ప్రత్యేకం

కరోనా ఎఫెక్ట్: దేశంలో ప్రింట్ మీడియా షట్ డౌన్ తప్పదా?

Newspapers

కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం దినపత్రికల సర్క్యులేషన్ పై గణనీయంగా పడుతున్నది. కరోనా వైరస్ పేపర్ పై 9 గంటల పాటు జీవించి ఉంటుందనే విషయం వెల్లడి కావడంతో చాలా మంది పత్రికలు ఇంటికి తెప్పించుకోవడం నిలిపివేస్తున్నారు.

అందువల్ల పత్రికల సర్క్యులేషన్ ఈ మధ్య కాలంలో గణనీయంగా పడిపోతుననది. కరోనా వ్యాప్తి లో పత్రికలు కూడా దోహదపడుతున్నాయని  కొంతకాలం షట్  డౌన్ చేయించాలనే  ఆలోచనలో  నరేంద్ర మోడీ ఉన్నట్లు  సమాచారం. సహజంగా ఉదయాన్నే అనేక చేతులు మరి మన ఇంటి గుమ్మం  ముందుకు దిన పత్రికలు, పాల పాకెట్స్  చేరుతాయి.

 పాల పాకెట్స్  ను కడిగి  ఉపయోగిస్తున్నారు కానీ, డైలీ పేపర్స్ పరిస్థితి ఆలా కాదు. ఎలాగూ ఎలక్ట్రానిక్ మీడియా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నాయి  కాబట్టి కొంతకాలం డైలీ పేపర్స్ పై షట్ డౌన్ ప్రకటించనున్నారు. ఇప్పటికే పలు  దేశాలు న్యూస్ పేపర్స్ ను నిషేధించాయి.

అదే బాట లో మన దేశంలో కూడా నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు పత్రికల యాజమాన్యాలకు  ముందు నోటీసులు ఇవ్వనున్నారు. మార్చి 31 తరువాత ఇదే ధోరణి లో కరోనా విజృoభిస్తే  పత్రికలు మూత పడటం ఖాయం.

ఇప్పటికే ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్ పత్రికలు కరోనా ఎఫెక్టుతో ఈ నెల 31 వరకూ సెలవులు ప్రకటించింది. బహుశ అన్ని పత్రికలూ ఇదే బాట పట్టాల్సి రావచ్చు.

Related posts

క్రిస్మస్:నాన్న విజయవాడలో కొడుకు గుంటూరులో

Satyam NEWS

ఇంటరాగేషన్: తట్టుకోలేక ఓ యువకుడి ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

తెలంగాణలో రేపటి నుంచి సినిమా థియేటర్లు మూత

Satyam NEWS

Leave a Comment