27.7 C
Hyderabad
May 4, 2024 08: 39 AM
Slider గుంటూరు

రేషన్ సరకులు డోర్ డెలివరీకి చురుకుగా ఏర్పాటు

#MiniVans

కొత్త సంవత్సరం నుంచి రేషన్‌ సరకులు డోర్‌ డెలివరీ అందచేస్తారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.

రేషన్‌ సరకులను మినీ వ్యాన్‌ ద్వారా లబ్ధిదారు ఇంటికే సరఫరా చేయనున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అందుకు అవసరమైన మినీ వ్యాన్లు సిద్ధం చేస్తోంది.

తొలి విడతగా 120 మినీ వ్యాన్లు జైపూర్‌ నుంచి గూడ్స్‌ రైలు ద్వారా మంగళవారం న్యూగుంటూరు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాయి.

గుంటూరు జిల్లాలో 817 మినీ ట్రక్కులు (వ్యాన్లు) అవసరమని జిల్లా అధికారులు గుర్తించారు. ఇందుకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు.

మినీ ట్రక్కుల కోసం అనూహ్య స్పందన లభించింది. ఈ 817 మినీ ట్రక్కులకు 8,179 మంది దరఖాస్తు చేశారు.

Related posts

60 సంవత్సరాలుగా సాధ్యం కాని సమస్యపై విజయం

Satyam NEWS

పట్టణ ప్రగతి ప్రోగ్రాంలో మనమే ముందుండాలి

Satyam NEWS

పిల్లల రక్షణలో అశ్రద్ధ చూపద్దు

Satyam NEWS

Leave a Comment