26.2 C
Hyderabad
October 15, 2024 12: 33 PM
Slider ముఖ్యంశాలు

60 సంవత్సరాలుగా సాధ్యం కాని సమస్యపై విజయం

student jac

నిరుద్యోగికి ఒకేసారి రెండు ఉద్యోగాలు వస్తే? ఉన్నత ఉద్యోగంలోనే చేరుతాడు. తర్వాత వచ్చిన చిన్న ఉద్యోగంలో చేరడు. లేదా చిన్న ఉద్యోగంలో ఉండి పెద్ద ఉద్యోగం రాగానే అందులోకి షిఫ్ట్ అవుతాడు. అప్పుడు ఆ ఉద్యోగం అలాగే బ్యాక్ లాగ్ గా మిగిలి పోతుంది.  

తర్వాత నోటిఫికేషన్ వచ్చే వరకు నిరుద్యోగులు ఆ ఉద్యోగం కోసం నిరీక్షించాలి. ఉదాహరణకు గ్రూప్ 1 ఉద్యోగం  సాధించిన ఒక వ్యక్తి గ్రూప్ 2 ఉద్యోగం కూడా సాధిస్తే  గ్రూప్ 1 ఉద్యోగంలో చేరిపోతాడు కానీ తర్వాత  వచ్చిన ఉద్యోగంలో చేరక పోవడంతో ఆ ఉద్యోగం బ్యాక్ లాగ్ ఉద్యోగంగా మిగిలి పోతుంది.

మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి కానీ దాన్ని భర్తీ చేసేందుకు వీలు లేదు. కానీ ఎల్చల దత్తాత్రేయ  పోరాటంతో ఈ నిబంధనలు మార్చారు. ఉన్నత ఉద్యోగం సాధించిన వ్యక్తి నుంచి రీలింక్విష్మెంట్ అంటే నాకు ఇదివరకే ఉద్యోగం వచ్చింది నేను ఇప్పుడు వచ్చిన ఈ ఉద్యోగంలో చేరడానికి ఇష్టంగా లేను అని ఆన్ విల్లింగ్ లెటర్ సబ్మిట్ చేస్తే చాలు. తరువాత ర్యాంకులో ఉన్న ఓ నిరుద్యోగికి ఉద్యోగం వచ్చేలా నిబంధనలు మార్చేలా దత్తాత్రేయ పోరాటం చేశారు.

ఈ పోరాటంలో ఆయన  విజయం సాధించడం వల్ల  ఎన్నో సంవత్సరాలుగా నిరీక్షించి ఎంతో కష్టపడి చదివి ఉద్యోగంలో ర్యాంకు సాధించి ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నా కూడా అవకాశాన్ని చేజార్చుకున్న నిరుద్యోగులు ఎందరో ఇప్పుడు లాభపడతారు.

ఓయూ జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ సూచనలతో హైకోర్టును ఆశ్రయించిన అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ  ఈ నిబంధన మార్చడంకోసం గత ఆరు నెలలుగా నిరంతరం శ్రమించాడు. ప్రభుత్వ ఉన్నత అధికారులతో పాటు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి, ఐఏఎస్ అధికారి వాణి ప్రసాద్ తో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు.

మందాల భాస్కర్, దత్తాత్రేయ ల సమన్వయంతో ఈ నిబంధన మారింది.  భవిష్యత్తులో ఒకే నోటిఫికేషన్ లో తర్వాతి ర్యాంకుల్లో ఉన్న ఓ నిరుద్యోగికి తక్షణం ఉద్యోగం వచ్చేలా ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చగలిగిన ఆధునిక చాణక్యుడు గా దత్తాత్రేయ మారారు.

ఆయన పోరాటం కారణంగా అటవీశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగంలో చేరని 324 ఉద్యోగాలకు తదుపరి మెరిట్ అభ్యర్థులకు అవకాశం ఇవ్వడంతో పాటు ఇటీవలే విడుదల చేసిన గ్రేడ్1ఉద్యోగం సాధించిన నిరుద్యోగులు గ్రేడ్ 2 కూడా సాధించారు  గ్రేడ్ 2 హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల్లో సైతం ఇదే విధంగా ఖాళీగా ఉన్న 68 గ్రేడ్ 2 ఉద్యోగాల్లో నిరుద్యోగులు చేరనున్నారు. 

ప్రభుత్వానికి, టీఎస్పీఎస్సీ అధికారులకు దత్తాత్రేయ నిరుద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఇదే కాదు పన్నెండు సంవత్సరాలుగా ఏ ఉద్యోగం కోసమైతే తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులు పన్నెండు వందల పైచిలుకు విద్యార్థులు   ప్రాణత్యాగం చేసుకున్నారో ఆ ఉద్యోగాల సాధన కోసం రాష్ట్రపతి ని కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసే నూతన జోనల్ వ్యవస్థపై తక్షణం నిర్ణయం తీసుకోవాలని కూడా ఆయన కోరారు.

జోనల్ వ్యవస్థ మీద రాష్ట్రపతి తీసుకునే నిర్ణయంతోనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల ప్రకటనలు వెలువడతాయని  త్వరలో వినతిపత్రం సమర్పించబోతున్న విద్యార్థి నిరుద్యోగులకు నిజమైన ప్రతినిధి ఓయు జేఏసీ అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ చైర్మన్ మందాల భాస్కర్ లు డా.గడ్డం శ్రీనివాస్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థి నేతలు చిరంజీవి బెస్త, పసర కొండాకిషోర్, రఘు, వంశీకృష్ణ, కొండూరు నవీన్, వెంకన్న, పాండునాయక్, ప్రేమ్ కుమార్ రవీందర్ నాయక్,మహేష్ యాదవ్, సురేష్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

Related posts

వెరైటీ: భారతీయుడు 2లో కాజల్ ఎలా కనిపిస్తుంది?

Satyam NEWS

బీసీ నాయకులకు ప్రముఖ దేవస్థానాల పాలక మండలిలో చోటు

Bhavani

మంచిర్యాల జిల్లాలో ఘోర ప్రమాదం: ఇద్దరు మృతి

Bhavani

Leave a Comment