40.2 C
Hyderabad
May 5, 2024 15: 27 PM
Slider నిజామాబాద్

మొక్కలు పెంచుకోవడం మన అందరి బాధ్యత

#Minister Prashanth Reddy

కామారెడ్డి పట్టణంలో నూతన కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో  ఆరవ విడత హరితహారం ప్రారంభించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి  కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బి.బిపాటిల్, ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజుల సురేందర్, డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ దఫెదర్ శోభా రాజు,పంచాయితీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, జిల్లా కలెక్టర్ డా.శరత్, ఎస్పీ శ్వేతా ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏ ముఖ్యమంత్రి, ఎ రాజకీయ నాయకుడు చేయని విధంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేశారని అన్నారు. గత 5 సంవత్సరాలుగా హరిత హారం కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా తీసుకుపోతున్నారని, గతంలో అటవీ శాఖ అధికారులు మాత్రమే మొక్కలు నాటే వారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వంలోని అన్ని శాఖలు అధికారులూ మొక్కలు నాటుతున్నారని ఆయన అన్నారు.

కేవలం కామారెడ్డి ఒక్క జిల్లాకే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ను కలుపుకుని మొదటి సంవత్సరం 80 కోట్లు, రెండవ సంవత్సరం 40 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ఆయన అన్నారు. చెట్లు పెంచుకుంటే మన పిల్లల్ని పెంచుకున్నటే, చెట్లను చంపుకుంటే మనల్ని మనం చంపుకున్నట్టేనని ఆయన అన్నారు.

Related posts

బిందువులం మేమే

Satyam NEWS

నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రి సిబ్బంది లో మరో ఇద్దరికి పాజిటివ్

Satyam NEWS

అకస్మాత్తుగా చెలరేగిన మంటలు: తప్పిన ప్రమాదం

Satyam NEWS

Leave a Comment